- పార్టీల వైపు విద్యార్థులు, వైద్యులు, జేఏసీ లీడర్ల చూపు
- ఉద్యమాల నుంచి ఎన్నికల బరిలోకి
- పార్టీల నేతలను కలుస్తున్న నాయకులు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేసి..పోలీసుల లాఠీ దెబ్బలు తిని.. చివరివరకు వెరవకుండా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యార్థి, టీఎన్జీవో, ప్రభుత్వ జేఏసీ నేతలు రాజకీ యబరిలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లో చేరి, టికెట్టు తెచ్చుకునే పనిలోపడ్డారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయా పార్టీల అధినేతలను కలుస్తున్నారు. రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వకుంటే ఒంటరిగానైనా పోటీచేసి ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని పలువురు విద్యార్థి నాయకులు,రాజకీయ జేఏసీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ సాధనలో తాము ఎంతో కృషిచేశామని, తమకు తప్పక గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధినేతలను కోరుతున్నారు.
ఓయూ ఆశావహులు వీరే : నాలుగురోజుల క్రితం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న టీఎస్‌జాక్ చైర్మన్ పిడమర్తి రవి-వికారాబాద్, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్- చొప్పదండి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్-ఆంథోల్, టీడీ పీలో చేరిన టీఎస్‌జాక్ మాజీకన్వీనర్ రాజారాంయాదవ్-ఆర్మూర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు మానవతారాయ్-సత్తుపల్లి, ఎంఎస్‌ఎఫ్ కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్-ఆలేరు, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయులుగౌడ్-గద్వాల, టీఎస్‌జేఏసీ కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు రాజేశ్వరియాదవ్-న కిరేకల్, మర్రి అనిల్‌కుమార్-తుంగతుర్తి, పుల్లారావుయాదవ్- ఖమ్మం, పున్నా కైలాస్‌నేత-మునుగోడు, చారకొండ వెంకటేష్-అచ్చంపేట, దుర్గంభాస్క ర్-చెన్నూరు, గాదరి కిషోర్-తుంగతుర్తి, కరాటేరాజు-కల్వకుర్తి, కళ్యాణ్-దేవరకొండ, శ్రీహరినాయక్- దేవరకొండ, గాదెవెంకట్- మిర్యాలగూడ, వీర బాబు-కోదాడ, చరణ్‌కౌశిక్-మల్కాజిగిరి, విజయ్-మహబూబ్‌నగర్, ప్రవీణ్‌రెడ్డి-నాగార్జునసాగర్, బండారి వీరబాబు-మధిర, రాకేష్-పెద్దపల్లి, రాస వెంకట్-ఆలేరు, రమేష్‌ముదిరాజ్-కామారెడ్డి, జగన్‌ముదిరాజ్-మెదక్, తొట్ల స్వామియాదవ్- నాగార్జునసాగర్, నెహ్రూనాయక్-డోర్నకల్, రాజేష్‌నాయక్-మహబూబాద్‌టౌన్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
వైద్యుల సంఘం నేతలూ : డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ వరంగల్ జిల్లా వర్థన్నపేట/స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలనుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీకి ఆసక్తి చూపుతుండగా, తెలంగాణ మెడికల్ జేఏసీ గ్రేటర్ చైర్మన్ డాక్టర్ లాలుప్రసాద్‌రాథోడ్ దేవరకొండ ఎమ్మెల్యే /ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల గిరిజన విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి శుక్రవారం కేసీఆర్‌ను కలిసి పోటీకి అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు.
జేఏసీ నేతలు : సికింద్రాబాద్, మల్కజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదొకదాని నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పొలిటి కల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కేసీఆర్ కోరగా విముఖత చూపారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన టీజీవోఅధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్ బెర్త్ దాదాపు ఖరారయ్యింది. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీశ్రీప్రసాద్, నాయకుడు విఠల్‌కు ఆశించిన స్థానాలను కేటాయించకపోవ డంతో పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలిసింది.