The State
-
రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలో త్వరలో నిర్వహించే డీటీఎఫ్ 4వ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. గురువారం స్థానిక లెక్చరర్స్ భవన్లో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ మాట్లాడారు. విద్యా విధానం కోసం, కామన్ స్కూల్ విధానం కోసం డీటీఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, బెల్లి యాదయ్య, వేణు సంకోజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కృష్ణ కౌండిన్య, ఆర్.విజయ్‌కుమార్, జి.కాశయ్య, ఎం.వీ.గోనారెడ్డి, దర్శనం నర్సింహ, పందుల సైదులు, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్‌రెడ్డి, వెంకులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ వాత
నెల్లూరు (రవాణా): ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు పెంచిన విద్యుత్ చార్జీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలపై రాష్ట్రప్రభుత్వం మరోమారు భారం మోపింది. నెలకు 200 యూనిట్లపైన వాడే వినియోగదారులపై 5 శాతం చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మధ్యతరగతికి చెందిన వారిపై భారం పడింది. ఇప్పటికే గ్యాస్, రేషన్, పింఛన్ తదితర లబ్ధిదారులను భారీగా కుదించారు. మరోవైపు నిత్యావరసర ధరలు చుక్కలంటుతున్నాయి. తాజాగా పెంచిన విద్యుత్ చార్జీలతో జిల్లాపై సుమారు రూ.7 కోట్ల భారం పడనుంది. అలాగే ప్రజలపై పరోక్షంగా మరికొంత భారం పడనుంది. వ్యాపారులు పెరిగిన విద్యుత్‌చార్జీల భారాన్ని వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. రోజుకు 99 లక్షల యూనిట్ల వినియోగం జిల్లాలో మొత్తం 11,86,838 మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో గృహ అవసరాలనకు 9,06,973, వాణిజ్య అవసరాలకు 73,992, పరిశ్రమలకు 42,112, వ్యవసాయానికి 1,45,000, వీధిదీపాలు 7,119, తాగునీటి అవసరాలకు 3,330, భారీ పరిశ్రమలు 495తో కలిపి ఇతర అవసరాలకు 7,943 సర్వీసులున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు ప్రస్తుతం 99 లక్షల యూనిట్లు విద్యుత్ వినియోగం జరుగుతుంది. దీని ద్వారా విద్యుత్‌శాఖకు నెలకు రూ.114 కోట్లు రెవెన్యూ వస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 200 యూనిట్లపైన వాడే వినియోగదారులు 1.25 లక్షలమంది ఉన్నట్లు సమాచారం. అయితే 0-200 వరకు వినియోగం ఉన్న వారిపై ఎలాంటి చార్జీలు పెంచలేదు. వ్యవసాయం, కుటీర, చక్కెర, ఫౌల్ట్రీ తదితర పరిశ్రమలను చార్జీల పెంపు నుంచి మినహాయించారు. ప్రజలపై పరోక్ష భారం చార్జీలు పెంపు నిర్ణయంతో జిల్లా ప్రజలపై సుమారు నెలకు రూ.7కోట్లు భారం పడనుంది. అధికారులు లెక్కలు ప్రకారం నెలకు 201 నుంచి 300 వరకు యూనిట్లు వినియోగించేవారు 61,943 మంది, 301 నుంచి 400 వరకు 29,646 మంది, 401 నుంచి 500 వరకు 15,638 మంది, 500 పైబడి 35,499 మంది వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం లోటెన్షన్ విభాగంలో రూ.9.98 కోట్లు, పరిశ్రమల నుంచి రూ.17.91 కోట్లు, హెచ్‌టీ విభాగంలోని పరిశ్రమల నుంచి రూ.44.24 కోట్లు, వాణిజ్య సర్వీసులనుంచి రూ. 7.71 కోట్లు రెవెన్యూ వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ సర్వీసులకు చెందిన వినియోగదారులపై అదనపు భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఆయా రంగాలకు చెందిన వస్తువులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రజలపై పరోక్షంగా భారం పడనుంది. అధికారికంగా సమాచారం లేదు. విద్యుత్ చార్జీల పెంపు విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తాం. - నాగశయనరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభుత్వం పెంచిన చార్జీలు యూనిట్లు పాత కొత్త 201 -300 వరకు (యూనిట్‌కు) రూ. 6.38 6.70 301 - 400 వరకు రూ. 7.38 7.75 401 - 500 వరకు రూ. 7.88 8.27 500 పైన రూ. 8.38 8.80లు -
సీమాంధ్రప్రదేశ్‌కు పేరేది?
నూతనంగా ఏర్పడే సీమాంధ్రప్రదేశ్‌కు బుద్ధప్రదేశ్‌గా పేరు పెట్టమని కోరటం విచిత్రంగా ఉంది. దీంట్లో కూడా మతం దాని చుట్టూ వివాదాలు చొరబడటం బాధాకరం. బ్రిటిష్ పరిపాలనా కాలం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచమని ఆంధ్రులు కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో దీక్షలు ఉద్యమాలు జరిపిన ఫలితంగా అమర జీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష గావించి ప్రాణ త్యాగం అర్పించిన పిదప రాష్ట్రం ఏర్పడింది. దాదాపు 6 దశాబ్దాల తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజనానంతరం మరోసారి నూతనంగా ఏర్ప డిన రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు రాష్ట్రం అని పేరు పెట్ట మని న్యాయంగా ఆంధ్ర ప్రజలు కోరాలి. అంతేగాని రాష్ట్రంలో 50 వేల మంది బౌద్ధుల జనాభా కూడా లేని బౌద్ధమ తం పేరు పెట్టమని కొంత మంది మేధావులు, వ్యక్తులు కోరడం చిత్రవిచిత్రంగా ఉన్నది. మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు అధికంగా గల ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 50 వేల మంది జనాభా కూడా లేని బౌద్ధమత ప్రతీక అయిన గౌతమ బుద్ధుని పేరు పెట్టమనటం సమంజసం కాదు. ఇప్పటికైనా ఇలాంటి వాదనలుమాని సకల వర్గాల ప్రజలు కలసి అమర జీవి పొట్టిశ్రీరాములు పేరును కొత్త రాష్ట్రానికి పెడితే ఆయన ఆత్మశాంతించే అవకాశం ఉంటుంది. - వై.సత్యనారాయణ చీరాల, ప్రకాశం జిల్లా -
కేసీఆర్ బిజీబిజీ
బొకే అందజేసిన శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంపై పార్టీ నేతలతో మంతనాలు ఇంటి వద్ద సందడి సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ సాగుతోంది. ఆయన్ను కలిసేందుకు అనేకమంది బారులు తీరుతున్నారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆరగంట పాటు నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రం గురించి పలు విషయాలను చర్చించినట్లు తెలిసింది. వీరితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకులతోపాటు పలుశాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధశాఖల ఉన్నతాధికారులు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ న్యాయవాదుల సంఘాల నాయకులు, పలు వ్యాపారసంస్థల అధిపతులు, పారిశ్రామివేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ కళాకారుల సంఘం నాయకులు, తెలంగాణ చిన్నపరిశ్రమల సంఘం నాయకులు, ముస్లిం, క్రైస్తవ ధార్మిక సంఘాల నేతలు, పలు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, తెలంగాణవాదులు కాబోయే సీఎంను కలిసి అభినందించారు. మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించాలి దోమలగూడ: నూతన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న కేసీఆర్‌ను తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి, కల్లు దుకాణాల సాధన సమితి ప్రతినిధులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. హైదరాబాదులో మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించాలని, తాటివనాల పెంపునకు గ్రామీణ ప్రాంతంలో ప్రతి సొసైటీకి ఐదు నుంచి పదిఎకరాల భూమిని కేటాయించాలని, గీత కార్మికుల సంక్షేమానికి గీత కార్పొరేషన్‌కు రూ.వెయ్యికోట్ల శాశ్వత నిధి కేటాయించాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి గీతకార్మికుడికి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని గౌడ ప్రతినిధులు కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. ఆయన్ను కలిసిన వారిలో గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ అంబాల నారాయణగౌడ్, కల్లు దుకాణాల సాధన సమితి కన్వీనర్ భిక్షపతిగౌడ్, గౌడ సంఘం ప్రధానకార్యదర్శి మూల శ్రావణ్‌కుమార్‌గౌడ్, గౌడ జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, గౌడ ప్రతినిధులు కాసుల సురేందర్‌గౌడ్, సదానందంగౌడ్, నారాయణగౌడ్, కక్కెర్ల కొమురయ్యగౌడ్, చెరుకు పాపయ్యగౌడ్, రామరాజుగౌడ్, నరేష్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, వేమూరు గణేష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్ తదితరులున్నారు. ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటాం ఉస్మానియాయూనివర్సిటీ : తన రాజకీయ ఎత్తుగడలతో ఎమ్మార్పీఎస్‌ను కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేశారని మాదిగ నేతలు విమర్శించారు. శుక్రవారం ఉస్మానియాయూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట రుద్రవరం లింగస్వామిమాదిగ, పురుషోత్తంమాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్రావుమాదిగ తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ జూన్ 2న ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. -
ఉద్యమ నేతలం.. సత్తా చాటుతాం...
పార్టీల వైపు విద్యార్థులు, వైద్యులు, జేఏసీ లీడర్ల చూపు ఉద్యమాల నుంచి ఎన్నికల బరిలోకి పార్టీల నేతలను కలుస్తున్న నాయకులు సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేసి..పోలీసుల లాఠీ దెబ్బలు తిని.. చివరివరకు వెరవకుండా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యార్థి, టీఎన్జీవో, ప్రభుత్వ జేఏసీ నేతలు రాజకీ యబరిలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లో చేరి, టికెట్టు తెచ్చుకునే పనిలోపడ్డారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయా పార్టీల అధినేతలను కలుస్తున్నారు. రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వకుంటే ఒంటరిగానైనా పోటీచేసి ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని పలువురు విద్యార్థి నాయకులు,రాజకీయ జేఏసీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ సాధనలో తాము ఎంతో కృషిచేశామని, తమకు తప్పక గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధినేతలను కోరుతున్నారు. ఓయూ ఆశావహులు వీరే : నాలుగురోజుల క్రితం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టీఎస్‌జాక్ చైర్మన్ పిడమర్తి రవి-వికారాబాద్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్- చొప్పదండి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్-ఆంథోల్, టీడీ పీలో చేరిన టీఎస్‌జాక్ మాజీకన్వీనర్ రాజారాంయాదవ్-ఆర్మూర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు మానవతారాయ్-సత్తుపల్లి, ఎంఎస్ఎఫ్ కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్-ఆలేరు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయులుగౌడ్-గద్వాల, టీఎస్‌జేఏసీ కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు రాజేశ్వరియాదవ్-న కిరేకల్, మర్రి అనిల్‌కుమార్-తుంగతుర్తి, పుల్లారావుయాదవ్- ఖమ్మం, పున్నా కైలాస్నేత-మునుగోడు, చారకొండ వెంకటేష్-అచ్చంపేట, దుర్గంభాస్క ర్-చెన్నూరు, గాదరి కిషోర్-తుంగతుర్తి, కరాటేరాజు-కల్వకుర్తి, కళ్యాణ్-దేవరకొండ, శ్రీహరినాయక్- దేవరకొండ, గాదెవెంకట్- మిర్యాలగూడ, వీర బాబు-కోదాడ, చరణ్‌కౌశిక్-మల్కాజిగిరి, విజయ్-మహబూబ్‌నగర్, ప్రవీణ్‌రెడ్డి-నాగార్జునసాగర్, బండారి వీరబాబు-మధిర, రాకేష్-పెద్దపల్లి, రాస వెంకట్-ఆలేరు, రమేష్ముదిరాజ్-కామారెడ్డి, జగన్ముదిరాజ్-మెదక్, తొట్ల స్వామియాదవ్- నాగార్జునసాగర్, నెహ్రూనాయక్-డోర్నకల్, రాజేష్‌నాయక్-మహబూబాద్టౌన్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. వైద్యుల సంఘం నేతలూ : డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ వరంగల్ జిల్లా వర్థన్నపేట/స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలనుంచి టీఆర్ఎస్ తరపున పోటీకి ఆసక్తి చూపుతుండగా, తెలంగాణ మెడికల్ జేఏసీ గ్రేటర్ చైర్మన్ డాక్టర్ లాలుప్రసాద్రాథోడ్ దేవరకొండ ఎమ్మెల్యే /ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల గిరిజన విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి శుక్రవారం కేసీఆర్‌ను కలిసి పోటీకి అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ నేతలు : సికింద్రాబాద్, మల్కజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదొకదాని నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పొలిటి కల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కేసీఆర్ కోరగా విముఖత చూపారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన టీజీవోఅధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్ బెర్త్ దాదాపు ఖరారయ్యింది. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీశ్రీప్రసాద్, నాయకుడు విఠల్‌కు ఆశించిన స్థానాలను కేటాయించకపోవ డంతో పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలిసింది.