నల్లగొండలో త్వరలో నిర్వహించే డీటీఎఫ్ 4వ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలో త్వరలో నిర్వహించే డీటీఎఫ్ 4వ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. గురువారం స్థానిక లెక్చరర్స్ భవన్‌లో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ మాట్లాడారు. విద్యా విధానం కోసం, కామన్ స్కూల్ విధానం కోసం డీటీఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, బెల్లి యాదయ్య, వేణు సంకోజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కృష్ణ కౌండిన్య, ఆర్.విజయ్‌కుమార్, జి.కాశయ్య, ఎం.వీ.గోనారెడ్డి, దర్శనం నర్సింహ, పందుల సైదులు, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్‌రెడ్డి, వెంకులు తదితరులు పాల్గొన్నారు.