succeed
-
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
సింథియా(విశాఖ పశి్చమ): భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వంసకనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశించిన కచి్చత పరామితులను అందుకుందని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష తాలూకు ఫొటోను భారత నేవీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. -
’ఆదిత్య’ మార్గాన్ని చక్కదిద్ది... కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యశోధనకు ఉద్దేశించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహ ప్రయోగంలో మరో కీలక దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. దాని మార్గాన్ని సరిదిద్దే ప్రక్రియను సజావుగా జరిపినట్టు ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 6న 16 సెకన్ల పాటు ఇది కొనసాగిందని వివరించింది. లగ్రాంజ్ పాయింట్1 వైపు ఉపగ్రహం నిర్దేశిత మార్గంలో సాగేలా ఉంచేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. ఆదిత్య –ఎల్1 సూర్యునిపైకి భారత తొలి ప్రయోగం. దీన్ని సెపె్టంబర్ 2న శ్రీహరికోట నుంచి జరిపారు. తర్వాత దాని గమనాన్ని సెపె్టంబర్ 19న లగ్రాంజియన్ పాయింట్ కేసి నిర్దేశించారు. తాజా ప్రయత్నం ద్వారా దాన్ని మరింతగా సరిచేశారు. 125 రోజుల పాటు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆదిత్య–ఎల్1ను సూర్యునికి అతి సన్నిహితమైన హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. -
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
బిజిలీ బంద్ విజయవంతం
చోడవరం : ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల పక్షాలు బిజిలీ బంద్‌ను నిర్వహించాయి. మంగళవారం రాత్రి దుకాణాలు, ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పేసి అంతా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ రోజును టీడీపీ, బీజేపీలు ప్రజలను నయవంచన చేసిన దినంగా అఖిల పక్షాలు బిజిలీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో భాగంగా రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు చోడవరం పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, కిరాణా, వస్త్ర, కిల్లీ దుకాణాలు, ఇళ్లల్లో సైతం లైట్లు బంద్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంగా ఈ బిజిలీ బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా కావాలని మద్దతు పలికాయి. íసీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల నాయకులు తమ పార్టీల జెండాలు చేతబట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొత్తూరు జంక్షన్ వద్ద ముక్తకంఠంతో బీజేపీ, టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రాష్ట్ర ప్రజలను మోసంచేశారని సీపీఐ డివిజన్ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, íసీపీఎం జిల్లా నాయకుడు నాగిరెడ్డి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ, జనసేన నాయకుడు జెర్రిపోతుల రమణాజీ ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీ, బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. ఈ బిజిలీ బంద్‌లో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలో సీపీఐ నాయకులు నేమాల హరి, చిరికి కొండబాబు, నేమాల నర్సింగరావు, ఆబోతు శ్రీనువాసరావు, బొర్రా కనకరాజు, వైఎస్సార్సీపీ మండల యూత్ అధ్యక్షుడు బలిరెడ్డి హరీష్, పట్టణ రైతు విభాగం ప్రతినిధి లెక్కల వెంకట్రావు, జనసేన నాయకులు నాని, తదితరులు పాల్గొన్నారు. -
‘ధనుష్’ ప్రయోగం సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో పారాదీప్ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది. -
అమెరికాతో సమఉజ్జీ
-
అమెరికాతో సమఉజ్జీ
అదే మా లక్ష్యం ► అణు కార్యక్రమం పూర్తి చేస్తా.. ► ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ప్రతిజ్ఞ సియోల్: సైనిక సంపత్తి విషయంలో అమెరి కాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరకొరియా అధికారిక మీడి యా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కిమ్ వ్యాఖ్యలను శనివారం ప్రసా రం చేసింది. తాజా క్షిపణి ప్రయోగంపై కిమ్ పూర్తి సంతృప్తి వ్యక్తంచేసినట్టు కేసీఎన్ఏ తెలిపింది. క్షిపణి సామర్థ్యాన్ని కిమ్ స్వయంగా పరిశీలించినట్టు తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ సైనిక సంపత్తిని పెంపొందించిందని కిమ్ వ్యాఖ్యానించినట్టు పేర్కొంది. ఈ మిస్సైల్ వాడేందుకు సిద్ధంగా ఉందని కిమ్ చెప్పారు. అంతర్జాతీయంగా ఆంక్షలు విధిస్తున్నా అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా వెనకడుగు వేసేలా ప్రతిదాడి చేసేందుకు అణు సామర్థ్యా న్ని సాధించామని, సైనిక సంపత్తిలో అమెరికాకు సమానంగా నిలవాలనేదే తమ లక్ష్యమని, తాజా పరీక్షలతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా పాలకులు సైనికచర్య(మిలిటరీ ఆపరేషన్) అనే మాట మాట్లాడేందుకు ధైర్యం చేయరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని కిమ్ సంకేతాలిచ్చారు. భవిష్యత్తులో చేసే ప్రయోగాలు అర్థవంతంగా, వాస్తవికంగా ఉంటాయని, ఇది దేశ సైనిక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కాగా, శుక్రవారం తాము ప్రయోగించింది మధ్య తరహాకు చెందిన ఖండాంతర క్షిపణి హ్వాసంగ్–12 అని ఉత్తరకొరియా శనివారం నిర్ధారించింది. ఈ క్షిపణి జపాన్ మీదుగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలింది. ఉత్తరకొరియా ఇప్పటి వరకూ చేసిన ప్రయోగంలో సుదూర ప్రాంతం ప్రయాణిం చిన క్షిపణి ఇదే. ప్రాంతీయ శాంతికి విఘాతం.. జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేయడాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రమైన రెచ్చగొట్టే చర్యని తప్పుబట్టింది. ఉత్తర కొరియా అణు, క్షిపణి ప్రయోగాల కారణంగా ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతోందని పేర్కొంది. భద్రతా మండలి అత్యవసర భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షలను అన్ని దేశాలు తక్షణం, పూర్తిగా అమలు చేయాలని సభ్య దేశాలకు సూచించింది. అమెరికా భయపడదు ‘ఉ.కొరియా ముప్పు’పై ట్రంప్ వాషింగ్టన్: అమెరికా, తన మిత్ర దేశాలను ఎవరూ భయపెట్టలేరని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొనేందుకు అమెరికా వద్ద ప్రభావశీల ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఆందోళనలను పెడచెవినపెడుతూ ఉ.కొరియా తాజాగా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఉ.కొరియాను దీటుగా ఎదుర్కోవడానికి సైనిక చర్యకు దిగే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా రక్షణ శాఖ సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ వెల్లడించారు. అమెరికా వైమానిక దళ 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ మీ శక్తి, సామర్థ్యాలను చూసిన తరువాత నా విశ్వాసం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. ఉ.కొరియా ముప్పు ఎదుర్కొనేందుకు మనకు ప్రభావశీల, మెరుగైన మార్గాలున్నాయన్న సంగతి అర్థమవుతోంది. బెదిరింపులకు దిగేవారి నుంచి మన ప్రజలు, మిత్రులు, మన సంస్కృతిని కాపాడుకోగలం’ అని అన్నారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి మ్యాటిస్ ఉ.కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ రక్షణ మంత్రి ఒనోడెరాతో ఫోన్లో మాట్లాడారు. ఉ.కొరియా ఆయుధ సంపత్తి సాయుధ సిబ్బంది వాహకాలు 2,500 యుద్ధ ట్యాంకులు 4,060 ఆర్టిల్లరీ, ఎయిర్ డిఫెన్స్ గన్స్ 32,100 సైన్యం 10, 20,000 యుద్ధ విమానాలు 545 హెలికాప్టర్లు 286 ప్రధాన యుద్ధ నౌకలు 3 తీరప్రాంత గస్తీ నౌకలు 383 ల్యాండిగ్‌క్రాఫ్ట్+హోవర్ క్రాఫ్ట్ 267 జలాంతర్గాములు 70. -
ఆరోసారి అణు పరీక్షలు
వెనక్కి తగ్గని ఉత్తర కొరియా టోక్యో: అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నా ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆరో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని, ఈసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా ఆదివారం ప్రకటించింది. తాజాగా నిర్వహించిన ప్రయోగం పరిపూర్ణ విజయం సాధించినట్టు వెల్లడించింది. ఈ అణు పరీక్ష వాస్తవిక సామర్థ్యం ఎంత అనేదానిపై స్పష్టత రాలేదు. దక్షిణకొరియా వాతావరణ ఏజెన్సీ మాత్రం ప్రస్తుత ప్రయోగం వల్ల వచ్చిన ప్రకంపనలు గత ప్రయోగాల కంటే ఐదారురెట్లు ఎక్కువని వెల్లడించింది. దీని వల్ల చైనా, రష్యాలో పలు భవనాలు కంపించినట్టు పేర్కొంది. మండిపడిన ట్రంప్ ఉత్తరకొరియా అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఉత్తరకొరియా ప్రకటనలు.. చేష్టలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. ఉత్తరకొరియాను వంచక దేశం(రోగ్ నేషన్)గా ట్రంప్ అభివర్ణించారు. వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాకు ఉత్తరకొరియా ఇబ్బంది, ప్రమాదకరంగా మారిందని, చైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. కొంతవరకే విజయవంతమైందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాను బుజ్జగించే చర్యలు ఫలించవని చెపుతూ.. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. దూకుడు నిర్ణయాలు వద్దు: చైనా మరోవైపు మిత్రదేశం చైనా కూడా ఉత్తరకొరియా చర్యను ఖండించింది. దుందుడుకు చర్యలు, నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత క్షిణిస్తుందని, ఇలాంటి వాటిని ఆపేయాలని, అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి చర్చలకు ముందుకు రావాలని సూచించింది. ఉత్తరకొరియా అణుపరీక్ష నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ నేతృ త్వంలో జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఉత్తరకొరియాపై తాజాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించాలని, ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు మరిన్ని అమెరికా బలగాలను దించాలని మూన్ డిమాండ్ చేశారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఉత్తరకొరియా అణుపరీక్షలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉత్తరకొరియా అణు పరీక్షల నేపథ్యంలో ట్రంప్, అబే తాజా పరిస్థితులపై ఫొన్లో మంతనాలు జరిపారు. కృత్రిమ భూకంప తీవ్రత 6.3 స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12.29 గంటల సమయంలో గతంలో అణు పరీక్షలు నిర్వహించిన పున్ గ్యేరీ ప్రాంతంలోనే ఉత్తరకొరియా తాజా అణుపరీక్ష నిర్వహించింది. సియోల్‌లోని అధికారులు ఈ ప్రయోగం వల్ల ఏర్పడ్డ కృత్రిమ భూకంపం తీవ్రత 5.7గా ప్రకటిస్తే.. అమెరికా జియోలాజికల్ సర్వే దీని తీవ్ర తను 6.3గా వెల్లడించింది. గతంలో ఉత్తర కొరియా నిర్వహించిన అణుపరీక్షల్లో అతి ఎక్కువ భూకంపం తీవ్రత 5.3 మాత్రమే. ఈ పరీక్షలకు సంబంధించి ఉత్తరకొరియా ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేసింది. అంతకు ముందు అధికార పార్టీ పత్రిక తన పతాక శీర్షికలో అణ్వాయుధాలను మోహరించిన ఖండాంతర క్షిపణిని కిమ్ పరిశీలిస్తున్న ఫొటోలను ప్రచురిం చింది. ఉత్తరకొరియా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు సామర్థ్యం 70 కిలోటన్నులు ఉంటుందని జపాన్ రక్షణ మంత్రి ఇట్సునోరి ఒనోడెరా వెల్లడించారు. గత పరీక్షల్లో ఇది 10–30 కిలో టన్నులు మాత్రమేనని అన్నారు. ఇది హైడ్రోజన్ బాంబే అనే విషయాన్ని కొట్టిపారేయలేమని, అయితే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆయుధాన్ని విజయ వంతంగా ఉత్తరకొరియా ప్రయోగించిందనేది వాస్తవమని చెప్పారు. -
ధర్నాను విజయవంతం చేయాలి
విద్యారణ్యపురి : ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందడం హక్కు అని, పాలకుల దయాదాక్షిణ్యాలతో వేసే భిక్ష కాదని 1982లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. గతంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రపంచబ్యాంకు, బహుళజాతి, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల ఒత్తిడితో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విధానంతో ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సీపీఎస్ రద్దుకోసం 11 ఉపాధ్యాయసంఘాలతో అక్టోబర్ 1న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేడర్ పోస్టులు, రాష్ట్ర కేడర్ పోస్టులు మాత్రమే ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దానికి కొన్ని సంఘాలు వంత పాడుతున్నాయన్నారు. ఇప్పుడున్న రెండు జోన్లకు బదులు ఆరు జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ కడారి భోగేశ్వర్ మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా బాధ్యులు ఎస్.గోవర్దన్ , డి.శ్రీనివాస్, పి.చంద్రం, మహబూబ్అలీ, వి.సోమేశ్వర్, బి.స్వామి, ఎస్.ఉపేందర్‌రెడ్డి, హెచ్.సమ్మయ్య, బి.సారయ్య, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గణపతి నవరాత్రులను విజయవంతం చేయాలి
పద్మాక్షి గుండంలో నిమజ్జనం లేదు డీఆర్వో శోభ హన్మకొండ అర్బన్ : గణపతి నవరాత్రులను విజయవంతం చేసేం దుకు అధికారులు కృషి చేయాల ని జిల్లా రెవెన్యూ అధికారి కె.శోభ సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని కలెక్టరేట్లో సోమవారం రాత్రి వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమి టీ సభ్యులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో శోభ మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడవచ్చనే విషయంపై భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో మట్టి విగ్రహాలను త యారు చేయించి ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. మెప్మా, డీఆర్డీఏ స్వయం సహాయక సంఘాల ద్వారా మట్టి విగ్రహాలను తయారు చేయించి ముఖ్యమైన కూడళ్లలో తక్కువ ధరకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హన్మకొండ పద్మాక్షి గుండంలో ఈసారి వినాయకుల నిమజ్జనం లేదన్నారు. బంధం చెరువు, సిద్ధేశ్వర ఆలయం గుండం, చిన్నవడ్డేపల్లి, రంగం, బెస్తం, కట్టమల్లన్న చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం ఉంటుందన్నారు. సీకేఎం కళాశాలలో వసతి.. నిమజ్జనంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వరంగల్ సీకేఎం కళాశాలలో వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. గణనాథులను నిమజ్జనం చేసే చెరువుల్లో సిల్ట్, నాచు, గుర్రపు డెక్క మొక్కలను తీయించాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. మైనింగ్‌శాఖ అవసరమైన క్రేన్లను, మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్ల ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందు కు పోలీసులు ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. -
రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలో త్వరలో నిర్వహించే డీటీఎఫ్ 4వ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. గురువారం స్థానిక లెక్చరర్స్ భవన్లో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ మాట్లాడారు. విద్యా విధానం కోసం, కామన్ స్కూల్ విధానం కోసం డీటీఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, బెల్లి యాదయ్య, వేణు సంకోజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కృష్ణ కౌండిన్య, ఆర్.విజయ్‌కుమార్, జి.కాశయ్య, ఎం.వీ.గోనారెడ్డి, దర్శనం నర్సింహ, పందుల సైదులు, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్‌రెడ్డి, వెంకులు తదితరులు పాల్గొన్నారు. -
డీ వార్మింగ్ డేను విజయవంతం చేయాలి
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలు డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలని వరంగల్ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ (వడుప్సా) జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు, ప్రధాన కార్యదర్శి ఎన్.దేవేందర్‌రెడ్డి, కోశాధికారి కె.శ్రీధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇ.సతీష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈనెల 10న అన్ని పాఠశాలల్లో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 10న పాఠశాలల్లోని విద్యార్థులందరికీ నట్టల మాత్రలు వేయించాలన్నారు. ఏదైనా కారణాలతో ఎవరైనా విద్యార్థులు ఆ రోజు నట్టల మందు మాత్రలు వేసుకోకపోతే వారికి మళ్లీ ఈనెల 18న వేస్తారన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం చేశాకనే విద్యార్థులకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్యంతో ఉండే విద్యార్థులకు ఈ మాత్రలు వేయించకపోవడం మంచిదని తెలిపారు. -
'ట్విట్టర్ అడ్డంకులు తొలగిపోయాయ్'
సుమారు దశాబ్దం చరిత్రగల సోషల్ మీడియా నెట్వర్క్ సంస్థ ట్విట్టర్.. యూజర్ సేఫ్టీ కోసం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని ఆ సంస్థ యూరప్ ప్రతినిధి బ్రూస్ డైస్లీ స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతికూల వార్తలతో ట్విట్టర్ వెనుకబడి పోతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 30 కోట్లకు పైగా యూజర్లతో 33 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న ట్విట్టర్ సంస్థపై ఇటీవల పలు విమర్శలు వస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్ల ద్వారా అభ్యంతరకరమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఈ మాద్యమం బాగా ఉపయోగపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఎన్నో ఏళ్లుగా ట్విట్టర్‌ను ఆదరిస్తున్న కొందరు ప్రముఖులు సైతం ఇటీవల తమ అకౌంట్లను క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైస్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్టోబర్‌లో సంస్థ సీఈవోగా జాక్ డోర్సీ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతికూల అంశాల నుండి ట్విట్టర్ నిలదొక్కుకుందని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత, ఇతర రక్షణ విషయాల్లో సంస్థ చేపట్టిన ప్రణాళికలు విజయవంతం అయినట్లు వెల్లడించారు. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అభ్యంతరకరమైన అకౌంట్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. అలాగే ఫోన్ ద్వారా వెరిఫికేషన్‌ను చేపట్టి అకౌంట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలను సమగ్రంగా నమోదు చేయడంలో చాలా వరకు సఫలీకృతం అయినట్లు డైస్లీ తెలిపారు. -
నూతన పద్ధతిలో శునకాల జన్మ!
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (కృత్రిమ ఫలదీకరణ) ద్వారా ప్రపంచంలోనే తొలిసారి కుక్కపిల్లలను సృష్టించారు అమెరికా శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి ద్వారా పుట్టిన 7 పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మొత్తం 19 అండాలను ఆడ కుక్కలోకి ప్రవేశపెట్టగా అది జూలై నెల్లో పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు పురోగతి చెందితే... మనుషులు, జంతువుల్లో వ్యాధినిరోధక లక్షణాలపై మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1970ల నుంచే కుక్కలపై ఐవీఎఫ్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా అవి సఫలం కాలేదని కార్నెల్ కాలేజ్ ఆఫ్ వెటర్నిటీ మెడిసిన్ ప్రొఫెసర్ అలెక్స్ ట్రావిస్ తెలిపారు. కుక్కల అండవాహికలో అండాలను ఒక రోజు అదనంగా ఉంచితే అవి ఫలదీకరణ చెందేందుకు మంచి అవకాశాలు ఉంటాయని కనుగొన్నారు. ఈ ప్రక్రియలో మెగ్నీషియంకు సెల్ కల్చర్‌ను జోడించడంతో ఇతర జంతువుల్లా కాకుండా ఆడ శునకాల్లో పునరుత్పత్తి వ్యవస్థపై పనిచేసి పిండంగా మారేందుకు సహాయపడుతుందని వారు చెప్తున్నారు. తాము చేసిన రెండు కొత్త మార్పులు ఇప్పుడు 80 - 90 శాతం విజయం సాధించేందుకు ఉపయోగపడ్డాయని ట్రావిస్ చెప్పారు. కుక్కల పునరుత్పత్తి చక్రంలో సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు ఇంప్లాంట్ చేసే అవకాశం ఉందని.. ఫలదీకరణ చెందిన అండాలను ప్రవేశపెట్టడం కూడా పెద్ద సవాలేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించుకునేందుకు ఐవీఎఫ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.