డీ వార్మింగ్ డేను విజయవంతం చేయాలి
Published Tue, Aug 9 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలు డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలని వరంగల్ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ (వడుప్సా) జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు, ప్రధాన కార్యదర్శి ఎన్.దేవేందర్‌రెడ్డి, కోశాధికారి కె.శ్రీధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇ.సతీష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈనెల 10న అన్ని పాఠశాలల్లో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 10న పాఠశాలల్లోని విద్యార్థులందరికీ నట్టల మాత్రలు వేయించాలన్నారు. ఏదైనా కారణాలతో ఎవరైనా విద్యార్థులు ఆ రోజు నట్టల మందు మాత్రలు వేసుకోకపోతే వారికి మళ్లీ ఈనెల 18న వేస్తారన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం చేశాకనే విద్యార్థులకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్యంతో ఉండే విద్యార్థులకు ఈ మాత్రలు వేయించకపోవడం మంచిదని తెలిపారు.
Advertisement