ప్రత్యేక కథనంలో ప్రస్తావించిన సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించిన నాయకులు
కరీంనగర్: కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల్లో సాక్షి పత్రిక రెపరెపలాడింది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లాలో అపరి ష్కృతంగా ఉన్న దళితుల సమస్యలపై సాక్షి మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించిం ది.
ఎల్‌ఎండీలో ముంపునకు గురైన హస్నాపూ ర్ గ్రామ దళితులకు నివేశన స్థలాల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలాలు చూపించలేదని, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ మూతపడడంతో దళిత విద్యార్థులు పోటీ పరీక్షలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరీంనగర్‌లో అంబేద్కర్ భవనాల కోసం కేటారుుంచిన స్థలాలు అన్యాక్రాంతం కావడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ నియూమకంలో జాప్యం, వివాహ ప్రోత్సాహకాల కోసం ఎదురుచూపులు, స్వయం ఉపాధి పథకాల్లో కోత, దశాబ్దాలుగా తెగని లీడ్‌క్యాప్ భూముల వ్యవహారం తదితర సమస్యలను కథనంలో ప్రస్తావించింది.
వీటితో దళితులు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యల పట్ల ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు కనబరుస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది. మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి సభలో సాక్షి కథనమే దళిత నాయకులకు అజెండాగా కనిపించింది. సాక్షి ప్రస్తావించిన పలు సమస్యలపై నాయకులు సభలో ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. ఇళ్ల స్థలాల విషయమై హస్నాపూర్ దళితుడు సభలో ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్‌లకు తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రాన్ని అందజేస్తూ తమకు న్యాయం చేయాలని సాక్షి పత్రిక ప్రతులను వారికి అందజేశారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వేదికపై నుంచి ప్రసంగిస్తూ సాక్షి పత్రికలో వచ్చిన దళితుల సమస్యలను ఏకరువు పెడుతూ జయంతి వేడుకల్లో హమీలు ఇవ్వడం, తర్వాత మరిచిపోవడం తగదని, ఇందులో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు కన్నం అంజయ్య, మాదరి శ్రీనివాస్, జన్ను జయరాజ్ మాట్లాడుతూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని సమస్యలైనా పరిష్కరించి దళితులకు అండగా నిలువాలని డిమాండ్ చేశారు.
స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి : చీఫ్ విప్ కొప్పుల, కలెక్టర్
ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాల కోసం జిల్లా కేంద్రంలో స్టడీసర్కిల్‌ను వీలైనంత త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకోసారి దళిత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి సరిహద్దు వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
నిరసనలు, వినతులు
కరీంనగర్ మండలం బహదూర్‌ఖాన్‌పేటలో దళితులు ఆలయంలోకి ప్రవేశించవద్దని అడ్డుకొని అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్పీని కోరారు.
- సీపీఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలోఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్కస్‌గ్రౌండ్ నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించి ఎంపీ, చీఫ్ విప్‌లకు వినతిపత్రం సమర్పించారు.
- దళితుడి భూమిని అన్యాక్రాంతం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న కరీంనగర్ మండలం చెర్లభూత్కుర్ గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
- శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సబ్‌ప్లాన్ నిధులను హాస్టళ్ల అభివృద్ధికి ఖర్చు చేయూలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సురేశ్, తిరుపతి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు.
- ధర్మారం మండల కేంద్రానికి చెందిన జేరిపోతుల శైలజ-బొల్లి సూరజ్ బీజేపీ జిల్లా నాయకుడు కన్నం అంజయ్య ఆధ్వర్యంలో వేదిక వద్ద ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరినిప్రజాప్రతినిధులు, కలెక్టర్, దళిత సంఘాల నాయకులు ఆశీర్వదించారు.
- ధర్మారం మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థినికి న్యాయవాది సుంకె దేవకిషన్ కుట్టుమిషన్‌ను ఎంపీ, చీప్ విప్ చేతుల మీదుగా అందజేశారు.
- సమావేశం ప్రారంభంలో వేదికపైకి ఎవరెవరూ వెళ్లాలనే విషయంపై దళిత సంఘాల నాయకులు మేడి మహేశ్, ఎర్రోళ్ల రవీందర్, తదితరుల మధ్య తీవ్ర గలాట జరిగింది. దీంతో సమావేశం కాసేపు గందరగోళంగా తయారైంది. చివరి పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
- బాబుజగ్జీవన్‌రాం, అంబేద్కర్ జయంతి వేడుకలను చైర్మన్‌గా విజయవంతంగా నిర్వహించిన చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ను దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.
అంబేద్కర్ జయంతి సభలో ‘సాక్షి’ రెపరెపలు
Published Wed, Apr 15 2015 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement