గ్రామాల్లో శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని నారాయణ పేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్: గ్రామాల్లో శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని నారాయణ పేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. పట్టణాల్లో గణేష్ విగ్రహాలను ఊరేగింపుచేసే సమయంలో విద్యుత్ వైర్లు సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంటపాల నిర్వాహకులు డీజేసౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కల్గించరాదన్నారు. రోడ్లపై మంటపాలు ఏర్పాటు చేసి డెకరేషన్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అన్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
చందాల పేరుతో ప్రజలను బలవంతం చేయరాదని మంటపాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మురళీగౌడ్, జడ్పీటీసీ వి.శ్రీహరి, తహశీల్దార్ అంజిరెడ్డి, సర్పంచ్ భాగ్యచంద్రకాంత్‌గౌడ్, ఈఓ స్వర్ణలత, బీజేపీ రాష్ట్ర వైస్ చైర్మన్ బి.కొండయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ఆశిరెడ్డి, అబ్దుల్ కవి, మండల టీఆర్‌ఎస్ అద్యక్షులు మామిళ్ల అంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షులు మదుసూధన్‌రెడ్డి, జిల్లా బీజేవైఎం కార్యదర్శి కల్లూరినాగప్ప, ఎండీ సలాం, పోలీస్‌సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.