కేంద్రం పరిశీలనలో ‘స్మార్ట్’
► మరోసారి పోటీలో వరంగల్
► మే 15లోపు ఫలితాల వెల్లడి
► రూ.2861 కోట్లతో సమగ్ర నివేదిక
► మొత్తం ఏడు థీమ్‌లు, 20 ప్రాజెక్టులు
► పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
స్మార్ట్‌సిటీ పథకం రెండో దశ అమలులో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో లోపాలను సవరించి.. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ఫలితం వెల్లడి కావాల్సి ఉంది.
సాక్షి, హన్మకొండ: నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఈ వంద నగరాలకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్)లతో స్మార్ట్‌సిటీ చాలెంజ్ కాంపిటీషన్‌లో పాల్గొనాలి. ఈ కాంపిటీషన్‌లో వచ్చిన డీపీఆర్‌ల ఆధారంగా తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేశారు. వరంగల్‌తో పాటు మరో 23 నగరాలు తృటిలో ఈ అవకాశాన్ని చే జార్చుకున్నాయి.దీంతో ఈ 23 నగరాలకు మరో అవకాశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కల్పించింది. వీటికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కాంపిటీషన్ ఏర్పాటుచేసి,ఈ ఏడాది ఏప్రిల్ 21 లోగా డీపీఆర్‌లను సమర్పించాల్సిం దిగా ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ కొత్త కార్యవర్గం ఎ న్నికైన వెంటనే మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సవరించిన డీ పీఆర్‌ను ఆమోదించారు. ఈ నివేదికను ఈ నెల 20న న్యూఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించారు.ఫాస్ట్‌ట్రాక్ కాం పిటీషన్‌లో వచ్చిన నివేదికలను మే 15లోగా పరిశీలించి, ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.
86 ప్రాజెక్టులు..
స్మార్ట్‌సిటీ ఫాస్ట్‌ట్రాక్ కాంపిటీషన్ కోసం సమర్పించిన నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్‌సిటీ పథకం నిబంధనల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని (సెంట్రల్ సిటీ) అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ప్రధానం. దీనికి అదనంగా నగరం మొత్తానికి పనికి వచ్చేలా (పాన్‌సిటీ) ఎంపిక చేసిన విభాగాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చు. సెంట్రల్‌సిటీ, పాన్‌సిటీల ద్వారా గ్రేటర్ వరంగల్‌లో రూ.2861 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. సెంట్రల్ సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ఏడు థీమ్‌లుగా విభజంచారు. ఈ ఏడు థీమ్‌ల ద్వారా మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 20 మేజర్ ప్రాజెక్టులు, 66 సబ్ మేజర్ ప్రాజెక్టులుగా విభజించారు.
భద్రకాళీ చెరువును పర్యాటక ప్రాంతంగా మా ర్చడం, ఎంపిక చేసిన మురికి వాడల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం, నగరంలో వాణిజ్యరంగం అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయల కల్పన, రవాణ వ్యవస్థ ఆధునీకరణ, పట్టణంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ పరిరక్షణ, నగరం మధ్యలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రధాన కార్యక్రమంగా సమగ్ర నివేదికలో పే ర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు రూ. 2707 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. పాన్‌సిటీ పథకం ద్వారా భద్రత, రవాణ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.153 కోట్ల వ్యయం అవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. నగర అభివృద్ధి నమూనాలో తొలిసారిగా పర్యావరణానికి పెద్దపీఠ వేశారు. సెంట్రల్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో పచ్చదనం పెంచేందుకు రూ.163 కోట్లు కేటాయించారు.
స్మార్ట్‌సిటీ ద్వారా రూ.989 కోట్లు
స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2861 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.989 కో ట్ల నిధులు మంజూరు కానున్నాయి. దీని తర్వా త ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ.906 కోట్లు సమీకరించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రూ.393,కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల ద్వారా రూ.370 కోట్లు, రుణాల ద్వారా రూ.203 కోట్లు సమీకరిస్తారించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు.