తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వేపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: సమగ్ర సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రంలోని మోడీ సర్కార్ దృష్టిని కేంద్రికరించినట్టు పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాల వివరాల జాబితాను కేంద్రం అడిగి తెలుసుకునే అవకాశం ఉందని కథనంలో పేర్కొంది. తెలంగాణ సమగ్ర సర్వే అంశంలో అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖా జోక్యం చేసుకోబోతున్నట్టు కథనంలో వెల్లడించింది.
సీమాంధ్ర ప్రజల్లో సమగ్ర సర్వే అనేక సందేహాలను రేకేత్తిస్తున్న నేపథ్యంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెన్షన్ సృష్టించే అవకాశం లేదని కేంద్ర ఆధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.