సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో చేరే విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం తమ ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేనుంది. శుక్రవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విధానాన్ని అన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించాక నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అయితే ఇందులో ప్రతి గంటను ఒక స్లాట్‌గా విభజిస్తారు. విద్యార్థులు అందులో ఏదో ఒక రోజులో వీలైన ఏదో ఒక సమ యాన్ని ఫీజు చెల్లించాక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ క్రమంలో విద్యార్థి ఆన్‌లైన్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని, సమయాన్ని ఎంచుకోవాలి. అలా స్లాట్ బుక్ చేసు కున్న విద్యార్థి సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు నిర్ణీత సమయంలో వెళ్లి తమ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
పాలిసెట్ కౌన్సెలింగ్ నుంచి ప్రారంభం
ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ నుంచి దీనిని అమల్లోకి తీసుకువస్తోంది. విద్యార్థి ఒకవేళ నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని పరిస్థితి ఉంటే ప్రవేశాల కమిటీకి మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే అతనికి తర్వాత వెరిఫికేషన్ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని పాలిసెట్‌కే కాకుండా ఎంసెట్, ఈసెట్ వంటి ఇతర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లోనూ అమలు చేయనున్నట్లు వివరించారు.
కోరుకున్న చోట సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Sat, May 11 2019 1:44 AM | Last Updated on Sat, May 11 2019 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment