రోడ్డు ప్రమాదంలో చికెన్ వ్యాపారి మృతి
మంగపేట: ఖమ్మం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో వరంగల్కు చెందిన ఓ చికెన్ వ్యాపారి మృతి చెందాడు. వరంగల్ జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన యాకూబ్‌అలీ(30) స్థానికంగా చికెన్ షాపు నిర్వహిస్తుంటాడు.
ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కోళ్లతో వ్యాన్‌లో అలీ రాజుపేటకు బయలుదేరాడు. పాల్వంచ సమీపంలో వేగంగా వస్తున్న లారీ వ్యాన్ను ఢీకొనడంతో అలీ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.