chicken shop
-
చికెన్ షాపులో కొండచిలువ.. షాకైన యజమాని.. తర్వాత ఏం జరిగిందంటే?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోజు అడవిలో ఎలుకలు, ఉడతలు తిని తిని బోర్ కొట్టిందో ఏమో ఒక కొండచిలువ చికెన్ షాప్‌లో దూరింది. చక్కగా అత్తారింటికి వచ్చిన అల్లుడిలా దర్జాలు వలకబోసి బాగా బలిసిన బ్రాయిలర్ కోళ్లను చూసి తన పంట పండిందనుకుంది. చక్కగా ఓ రెండు కోళ్లను గుటుక్కున మింగి సేదతీరింది. తెల్లారే వచ్చి చూసిన చికెన్ షాపు యజమానికి కొత్త అల్లుడిలా కోళ్ల ఫామ్ లో కొండచిలువు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వచ్చిన సిబ్బంది తిన్న కోళ్లు కక్కించి బుద్ధిగా ఉండమని మళ్లీ అడవికి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో జరిగింది ఘటన. చదవండి: Telangana: నేడు, రేపు వర్షాలు -
చికెన్ షాపు యజమాని వీరంగం
కర్ణాటక: కొనుగోలుదారుపై కత్తితో దాడి చేసిన చికెన్ షాపు యాజమానిని రాయకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు రాయకోటకు చెందిన రోషన్ (41)కి చికెన్ అంగడి ఉంది. శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి (36) వెళ్లి చికెన్ కొన్నాడు, కానీ నాణ్యంగా లేదని చెప్పడంతో ఆవేశానికి గురైన రోషన్ అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలేర్పడిన అతను రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి రోషన్‌ను అరెస్ట్ చేశారు. మహిళ కిడ్నాప్‌పై ఫిర్యాదు కూతురు కిడ్నాప్ అయ్యిందని ఆమె తండ్రి సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూళగిరి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మహిళ కుందారపల్లిలో నిర్వహిస్తున్న ఓ హోటల్లో పనిచేసేది. గత 7వ తేదీ విధులకెళ్లిన ఆమె రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో అంతటా గాలించాడు. స్థానికుల సమాచారం మేరకు అదే హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్న సలావుద్దీన్ బాషా కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
బాక్స్ కథా చిత్రం: ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో..
అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు దూరం.. 63 కిలోమీటర్లు మధురవాడ నుంచి కాపులుప్పాడకు దూరం.. 8 కిలోమీటర్లు ఇందులో ఏది దగ్గరని ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఘనత వహించిన జీవీఎంసీలోని కాంట్రాక్టర్లు మాత్రం మధురవాడ నుంచి కాపులుప్పాడకే దూరం ఎక్కువ అని చెబుతున్నారు. జీవీఎంసీలోని ప్రజారోగ్యశాఖ అధికారులు సైతం అవునంటూ తాళం వేస్తున్నారు. అంతేకాదు మీరు చెప్పిన సమాధానమే కరెక్టేనంటూ బహుమతి కింద కాంట్రాక్ట్‌ను సైతం అప్పగించారు. ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో.. ఈ బాక్సు టెండర్ల వ్యవహారమెంటో తెలుసుకుంటే మతిపోతోంది. సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు బాక్సు టెండర్లు పిలిచారు. ఓ నెలలో ఒక షాపు నుంచి వచ్చే చికెన్/మటన్ వ్యర్థాలను మధురవాడ నుంచి కాపులుప్పాడకు తరలించేందుకు రూ.110కు కాంట్రాక్టర్లు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. అయితే, అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు ఇవే వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.100 మాత్రమే కోట్ చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు సైతం గుడ్డిగా తలూపి పనులను అప్పగించారు. ఈ లెక్కన అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు అయ్యే వ్యయం కంటే.. మధురవాడ నుంచి కాపులుప్పాడకు అయ్యే వ్యయమే ఎక్కువని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు కూడా అవునంటూ పనులను అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంలో అసలు ‘చేపల’ కథ వేరే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వద్దు.. బాక్సులే ముద్దు...! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను తరలించేందుకు టెండర్లను గత ఏడాది జూన్‌లోనే పిలిచారు. కరోనా నేపథ్యంలో దీనిని రద్దు చేశారు. తాజాగా తిరిగి టెండర్లను పిలిచారు. అయితే ఆన్లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే చేపడుతున్నారు. అయితే, జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయించడంలో ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడం లేదు. అక్కడ రూ.100.. ఇక్కడ రూ.110 జీవీఎంసీ పరిధిలో 2019 లెక్కల ప్రకారం 1,600 చికెన్, మటన్ షాపులున్నాయి. రోజూ ఈ షాపుల నుంచి వచ్చే 60 టన్నుల వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లు ఆహ్వానించగా పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లిలో సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించేందుకు షాపునకు రూ.100 అయితే, మధురవాడలోని షాపుల నుంచి సేకరించిన వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.110 లెక్క టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. వాస్తవానికి అనకాపల్లితో పోల్చుకుంటే మధురవాడ చాలా దగ్గర. అయినా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. చేపల యజమానుల చేతివాటమని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి సేకరించిన వాటిని యలమంచిలి, పెందుర్తిలోని చేపల చెరువులకు తరలించవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇది చట్టరీత్యానేరం. దీనిపై జీవీఎంసీతో పాటు మత్స్యశాఖ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. -
చికెన్ డబ్బు అడిగినందుకు కానిస్టేబుల్ దౌర్జన్యం
చిత్తూరు అర్బన్ : తీసుకున్న చికెన్‌కు డబ్బులివ్వమని అడిగినందుకు ఓ కానిస్టేబుల్ దుకాణ మేనేజర్‌పై దౌర్జన్యం చేశాడు. ఇది చూసి స్థానికులు నివ్వెరపోయారు. వివరాలిలా.. నగరంలోని పలమనేరు రోడ్డులో ఓ వ్యక్తి చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఓ కానిస్టేబుల్ కేజీ చికెన్ తీసుకుని డబ్బు లివ్వలేదు. మీరే తొలిబోణీ అని, పది రూపాయలు తగ్గించుకుని డబ్బులివ్వాలని చికెన్ షాపు వ్యక్తి ప్రాధేయపడ్డాడు. పోలీసు అని చెప్పినా డబ్బులు అడుగుతావా.. అంటూ పోలీసు అతనితో వాగ్వాదానికి దిగాడు. తాను దుకాణంలో పనిచేసే వ్యక్తినని, డబ్బులివ్వకపోతే తన జీతంలో కట్ చేస్తారని చికెన్ షాపు వ్యక్తి ప్రాధేయపడ్డాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ అతన్ని రోడ్డుపైకి లాగి తన్నాడు. తప్పు తనది కానప్పటికీ ఎందుకు కొడుతున్నారని అతడు అడుగుతున్నా కానిస్టేబుల్ కొట్టడం మానలేదు. సహనం కోల్పోయిన దుకాణ మేనేజర్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. రోడ్డుపై ఇద్దరూ కొట్టుకుంటూ ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి ముక్కున వేలేసుకున్నారు. కొంతసేపటి తరువాత గొడవపడుతున్న వారిని స్థానికులు విడగొట్టి సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. కాగా గొడవపడిన కానిస్టేబుల్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. -
మాంసం అమ్మకంలో మోసం
అమరావతి,నగరంపాలెం: చికెన్ స్టాల్స్‌లో కుళ్లిన, దుర్వాసనతో బూజు పట్టిన స్థితిలో ఫ్రిజ్‌లలో కేజీల కొద్ది నిల్వ ఉన్న మాంసాన్ని రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్ఎండీసీ) చైర్మన్ ప్రకాష్ నాయడు ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా సోమవారం నగరంలో పలు ప్రాంతాల్లోని చికెన్ స్టాల్స్, పౌల్ట్రీ ఫారాల్లో ఆయన నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖతో కలసి తనిఖీలు నిర్వహించారు. నల్లచెరువు ప్రదాన రహదారిలో ఉన్న రెండు, మణిపురం బ్రిడ్జ్ వద్ద, పొన్నూరురోడ్డులోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఫ్రిజ్‌ల్లో కిలోల కొద్ది కుళ్లినన స్థితిలో గడ్డకట్టిన మాంసాన్ని గమనించి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందితో ప్రకాష్ నాయుడు చెత్త కుండీలో వేయించారు. దుకాణ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ తప్పుగా షాపులకు రూ.95 వేలు అపరాధ రుసుం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాంసం దుకాణాలపై ప్రజారోగ్య, ఫుడ్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని చైర్మన్ ప్రకాష్ నాయుడు తెలిపారు. మాంసం విక్రయిదారులకు స్థానిక సంస్ధల సహకారంతో త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టరు శోభారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
రెండు గ్రామాల్లో ఉద్రిక్తత
♦ ఆదివారం చికెన్షాపు తెరవడంతో మరోమారు గొడవ ♦ దాడిలో ఇద్దరికి గాయాలు సాక్షి, నారాయణవనం: సత్యవేడు నియోజకవర్గంలోని నారయణవనం మండలం సముదాయం, కీళగరం దళితవాడల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం సముదాయంకు చెందిన దొరస్వామి, అతని అల్లుడు దినకరన్ నారాయణవనంలోని కీళగరం క్రాస్ వద్ద చికెన్ షాపును తెరిచారు. దీంతో కీళగరం దళితవాడకు చెందిన యువకులు షాపును ధ్వంసం చేసి వారిపై దాడికి పాల్పడారు. ఈ దాడుల్లో దినకరన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, నలుగురు డీఎస్పీలతో పాటు 10 మంది సీఐలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏఆర్ పొలీసులు, పుత్తూరు సబ్‌డివిజన్‌లోని అన్ని సర్కిళ్ల పోలీసులు నారాయణవనానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు పుత్తూరులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మండల పార్టీ మన్వీనర్ సొరకాయలు, ఎంపీపీ సుబ్బరాయశెట్టి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరవి ఆదివారం సాయంత్రం పోలీసులతో చర్చించారు. అనంతరం సమస్య పరిష్కారానికి పీఎస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పుత్తూరు సీఐ సాయినాథ్ ప్రకటించారు. గొడవలకు కారకులైన వారి వివరాలను తెలపాలని సీఐ కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండుగ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రెండు గ్రామాల మధ్య జరిగిన దాడిలో ఏడుమంది గాయపడిన సంఘటన తెలిసిందే. అమాయకులపై కేసులు వద్దు మండలంలోని సముదాయం, కీళగరం దళితవాడ వాసుల మధ్య నెలకొన్న ఘర్షణల్లో అమాయకులపై కేసులు పెట్టకుండా పోలీసులు న్యాయం చేయాలని సమన్వయకర్త ఆదిమూలం పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘర్షణలకు దూరంగా ఉన్న వారిపై కేసులు పెట్టొద్దన్నారు. రెండు గ్రామాల్లో పీఎస్ కమిటీæ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో చికెన్ వ్యాపారి మృతి
మంగపేట: ఖమ్మం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో వరంగల్‌కు చెందిన ఓ చికెన్ వ్యాపారి మృతి చెందాడు. వరంగల్ జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన యాకూబ్అలీ(30) స్థానికంగా చికెన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కోళ్లతో వ్యాన్‌లో అలీ రాజుపేటకు బయలుదేరాడు. పాల్వంచ సమీపంలో వేగంగా వస్తున్న లారీ వ్యాన్‌ను ఢీకొనడంతో అలీ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.