చిన్నారికి పెద్ద కష్టం | Child Suffering With Heart Hole Parents Asks For Help In Sirisilla | Sakshi
Sakshi News home page

చిన్నారికి పెద్ద కష్టం

Published Mon, Mar 25 2019 1:00 PM | Last Updated on Mon, Mar 25 2019 1:00 PM

Child Suffering With Heart Hole Parents Asks For Help In Sirisilla - Sakshi

ధర్మతేజ, వేడుకుంటున్న తల్లిదండ్రులు

సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేటీఆర్‌ సారూ.. మా కొడుకును కాపాడండంటూ కోరుతున్నారు ఓ చిన్నారి తల్లిదండ్రులు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ చేనేత వృత్తి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఉయ్యాల మధు అనే నేత కార్మికుడు. అతడికి భార్య, కూతురు శ్రీకృతి(4), కొడుకు ధర్మతేజ(2) ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి అనుకోని ఆపద వచ్చి పడింది. ఒక్కగానొక్క కొడుకు ధర్మతేజ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించగా.. గుండెకు చిల్లు పడిందని, ఆపరేషన్‌ చేస్తేనే ప్రాణం దక్కుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.2లక్షలు ఖర్చవుతుందని, వెంటనే డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

నిరుపేద కుటుంబమైన తమకు అంత ఖర్చు చేసి ఆపరేషన్‌ చేయించే స్తోమత లేదని, తమ కొడుకును ఆదుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు లేఖ రాశారు. తమ కొడుకు బతుకైనా, చావైనా కేటీఆర్‌ చేతిలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయతో మా కొడుకుకు ప్రాణభిక్ష ప్రసాదించాలని కోరుతున్నారు. సాయం చేసే దాతలు సెల్‌ నం.95051 07660ను సంప్రదించాలన్నారు. ఆర్థిక సాయం అందించేవారు బాబు తల్లి ఉయ్యాల సుజాత బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ 79028825505 దక్కన్‌ గ్రామీణ బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0ఆర్‌ఆర్‌డీసీజీబీ నంబరుకు నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement