తల్లి చెంతకు చిన్నారులు | children on road | Sakshi
Sakshi News home page

తల్లి చెంతకు చిన్నారులు

Published Tue, Jun 16 2015 3:33 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

తల్లి చెంతకు చిన్నారులు - Sakshi

తల్లి చెంతకు చిన్నారులు

చైతన్యపురి: ‘ఈ చిన్నారులు ఎవరు?’ అనే శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో ఆ బాలికల వివరాలు తెలిశాయి. వారు మలక్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన కటారి రమేష్, సౌందర్య దంపతుల కూతుళ్లు ఐశ్వర్య (6), సాయిప్రియ(2)గా గుర్తించారు. సరూర్‌నగర్ సీఐ కృష్ణప్రసాద్ కథనం ప్రకారం... శనివారం సీసాలబస్తీలోని రోడ్డుపై ఇద్దరు చిన్నారులు తిరుగుతుండగా పోలీసులు చేరదీసి వివరాలు తెలుసుకొనేందుకు యత్నించారు. ఫలితం లేకపోవడంతో చిన్నారులను అమీర్‌పేటలోని బాలికల సదనానికి తరలించారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చూసిన పిల్లల తల్లి ఐశ్వర్య సోమవారం సరూర్‌నగర్ పోలీసులను కలిసి ఆ పిల్లలు తమ బిడ్డలేనని తెలిపింది.

భార్యాభర్తలు గొడవ పెట్టుకుని చిన్నారులు ఐశ్వర్య, సాయిప్రియలను దిల్‌సుఖ్‌నగర్‌లోని ఉండే వారి అమ్మమ్మ ఇంట్లో వదిలి వచ్చారు. అయితే, చిన్నారులిద్దరూ అమ్మమ్మ ఇంట్లోలేని సమయంలో రోడ్డు మీదకు వచ్చి తిరుగుతూ పోలీసుల కంటబడ్డారు. సౌందర్య చెప్పిన వివరాల మేరకు చిన్నారులిద్దరూ ఆమె బిడ్డలేనని నిర్థారించుకొని, హోంలో ఉన్న  పిల్లలను ఆమెకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement