సెల్ఫీ పాయింట్
సాక్షి, నల్గొండ : కరోనా వైరస్ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయటానికి పోలీసులు శాయశుక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సామ,దాన, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లాలోని పాణ్యం పోలీసులు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని ఓ షార్ట్‌ఫిల్మ్‌తో వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని చిట్యాల పోలీసుల వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనవసరంగా రోడ్డుమీద తిరిగే వారికోసం ఓ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు చిట్యాల పోలీసులు. ( ‘అవినీతి జరిగిందని నిరూపించగలరా ?’ )
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లమీద తిరిగే వారు ఆ బోర్డు ముందు సెల్ఫీ దిగేలా చేస్తున్నారు. ఆ బోర్డుపై ‘‘ నేను ఇంట్లో ఉండను, నేను ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతాను. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తాను. నేను మూర్ఖున్ని.. నేను సామాజిక శత్రువుని’’ అని రాసి ఉండటం గమనార్హం. ( వైరల్ : రాజ్-సిమ్రాన్‌ల ప్రేమ, కలహం )
Comments
Please login to add a commentAdd a comment