సంగారెడ్డి అర్బన్ : కులమతాలకు అతీతంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం తరఫున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అదేవిధంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ అంటే ఒక్క ముస్లింలు ఒక్కరే కాదని క్రిస్టియన్లు, జైనులు తదితరులు మైనార్టీల కిందకు వస్తార న్నారు.
మొదటిసారి ప్రభుత్వ పరంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్, అందరి సహకారం వల్లనే తెలంగాణ సాకారమైందని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు బాబుమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, జిల్లాలోని వివిధ చర్చీల పాస్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Published Mon, Dec 22 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement