పాస్టర్కు భార్య దేహశుద్ధి | church father beats by wife | Sakshi
Sakshi News home page

పాస్టర్కు భార్య దేహశుద్ధి

Published Sun, May 31 2015 3:39 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

పాస్టర్కు భార్య దేహశుద్ధి - Sakshi

పాస్టర్కు భార్య దేహశుద్ధి

వరంగల్: వరంగల్లో ఓ పాస్టర్కు దేహశుద్ధి జరిగింది. మొదటి భార్యతో విడాకులు తీసుకొని స్రవంతి అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని గత ఏడేళ్లుగా కాపురం చేస్తున్న అతడు నానారకాలుగా ఇబ్బంది పెడుతుండటంతో స్రవంతి ఆవేశం కట్టలు తెంచుకుని దాడి చేసింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం శనిగాపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామంలోని ఏసుదేవులు చర్చి ఫాదర్‌గా పనిచేస్తున్న రెవరెండ్ పద్మం నాగేంద్రపాల్ గత ఏడు సంవత్సరాలుగా భార్య స్రవంతితోకలిసి ఇదే గ్రామంలో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో కొన్ని రోజులుగా భార్యతో గొడవ పడటమే కాకుండా.. నువ్వు నా భార్యవు కావంటూ నిందింస్తున్నాడు. పైగా రోజూ ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోతుండటంతో వేరే వారి సహాయంతో బయటకు వచ్చిన ఆమె స్రవంతి మహిళా సంఘాలను ఆశ్రయించింది. నాగేంద్రపాల్ ఆదివారం చర్చిలో ప్రార్థనలు జరుపుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న స్రవంతి మహిళా సంఘాల నాయకులతో కలిసి చర్చి ముందు ధర్నాకు దిగింది. దీంతో గొడవకు దిగిన ఫాదర్‌కు స్రవంతికి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు. కాగా నాగేంద్రపాల్‌కు గతంలో వివాహం అయింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఏడేళ్లుగా స్రవంతి ఉంటున్నాడు. తాజాగా మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని స్రవంతి ఆరోపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement