church Father
-
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్‌గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్‌లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
మతం ముసుగులో మోసం
కనీసం మూడో తరగతి విద్యార్హత కూడా లేదు. అయితేనే యువతులను మోసం చేయడంలో మాత్రం దిట్టగా మారాడు. మత బోధకుడి అవతారమెత్తి ప్రార్థనసభ ముసుగులో యువతులను లోబరుచుకుని లైంగిక దాడులకు పాల్పడ్డాడు. 50 మంది బాధితుల్లోని ఐదుగురు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాపంపండిఅరెస్టయ్యాడు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్యాకుమారి జిల్లా మేక్కామండపంకు చెందిన రెండోతరగతి మాత్రమే చదువుకున్న ఒక వ్యక్తి మతబోధకుడిగా ప్రచారం చేసుకుంటూ ప్రార్థనాసభను ప్రారంభించాడు. వివాహ యోగం, భర్తతో సఖ్యత, విదేశాల్లో ఉద్యోగం వంటి తమ కుటుంబ కష్టాలను తీర్చుకునేందుకు తనవద్దకు వచ్చే ధనిక యువతులకు ఊరట కలిగించే మాటలు చెప్పి లైంగికంగా లోబరుచుకునేవాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా వీడియోగా చిత్రీకరించేవాడు. తరువాత ఆ దృశ్యాలను వారికి చూపి బెదిరించి రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు దోచుకున్నాడు. ఇలా సుమారు 50 మందికి పైగా యువతులు, మహిళలు మోసపోయినట్లు సమాచారం. మతబోధకుడి మోసాలను అర్థం చేసుకుని తాము ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని కోరినా, మరో సభకు వెళ్లినా లైంగిక వీడియో దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతానని తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేసేవాడు. ఇతని అరాచకాలను సహించలేని ఐదుగురు యువతులు తగిన ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ధన, జనం బలం మెండుగా కలిగి ఉన్న ఈ నకిలీ మత బోధకుని ఘోరాలు రచ్చకెక్కడంతో కొన్నినెలల క్రితం పారిపోయాడు. బాధిత మహిళల ఫిర్యాదును గోప్యంగా ఉంచి క్రైంబ్రాంచ్ పోలీసులు రహస్య విచారణ ప్రారంభించారు. నాగర్‌కోవిల్ ఎస్ఐ మోహన్ అయ్యర్ గురువారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ బోధకుడు తన స్నేహితులతో కలిసి మోటార్‌సైకిల్‌పై వచ్చాడు. వారిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో అతడు పారిపోయేందుకుప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతని సెల్‌ఫోన్‌ను పరిశీలించేందుకు వీలుకాకుండా నకిలీ పాస్వర్డ్ ఇవ్వడంతోపాటు తన సెల్‌ఫోన్ ఓపెన్ చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించడంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఆ తరువాత పోలీసులతో ఘర్షణపడి ఆసుపత్రిలో అడ్మిట్‌కాగా పారిపోకుండా బందోబస్తు పెట్టారు. నకిలీ మత బోధకుడిని ఇంకా ఉపేక్షించకుండా అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు పోలీసులతో మొరపెట్టుకున్నారు. -
ప్రార్థన పేరుతో నయవంచన
ఒంగోలు, మద్దిపాడు: మండలంలోని రాచవారిపాలెం ఎస్సీ కాలనీలో పాస్టర్‌గా పని చేస్తున్న గంగుల జాన్సన్ తనను మోసం చేశాడని ఆదే గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందిన వివరాల ప్రకారం.. రాచవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు మహిళలు ప్రార్థన కోసం చర్చికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాస్టర్ ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమె తల్లిని కూడా మాయమాటలతో లోబరుచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వద్ద 4 లక్షల 75 వేల రూపాయలు తీసుకుని సొంతానికి వాడుకున్నాడు. డబ్బు ఇచ్చిన విషయం కేవలం తనకు, పాస్టర్కు, ఆయన భార్యకు మాత్రమే తెలుసని బాధితురాలు చెబుతోంది. గత జూన్ నుంచి తల్లీకుమార్తెను బయట ప్రాంతాల్లో తిప్పుతూ మూడు నెలల నుంచి ఒంగోలులో ఉంచాడు. పాస్టర్కు తన తల్లి ఇచ్చిన విçషయం తెలుసుకున్న యువతి తమ డబ్బు తమకు ఇవ్వాలని, లేకుంటే ప్రార్థన జరిగే సమయంలో పెద్దల మధ్యకు వస్తానని పాస్టర్కు మెసేజ్ పెట్టింది. ఆయన ఫిర్యాది తల్లికి ఫోన్ చేసి ఫిర్యాదిని చంపేస్తే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందని, మన మధ్య అడ్డు లేకుండా పోతుందని పాస్టర్ చెప్పాడు. అందులో భాగంగా ఫిర్యాదిని చంపేందుకు ఒంగోలుకు చెందిన వ్యక్తితో ప్లాన్ చేశాడు. తనను చంపేందుకు ప్లాన్ చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు, పాస్టర్ మాటలు రికార్డు చేసి తనకు ప్రాణభయం ఉందని ఆమె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాలనీ వాసులు మాట్లాడుతూ పూర్తిగా నమ్మిన పాస్టర్ ఈ విధంగా మోసపూరితంగా వ్యవహరించి మహిళలను లోబరచుకుంటున్నాడని ఆరోపించారు. ఆయన ఇప్పటి వరకూ సుమారు ఎనిమిది మంది మహిళలను యువతులను మోసపూరిత మాటలతో లొంగబరుచుకున్నాడని, వారి నుంచి డబ్బు వసూలు చేశాడని ధ్వజమెత్తారు. కాపురం పోతుందన్న భయంతో మహిళలు బయటకు రావడం లేదని పేర్కొన్నారు. సాయంత్రం పాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్ బయట కాలనీ వాసులు గుమిగూడి తమకు పాస్టర్‌ను చూపాలని, అతనితో మాట్లాడాలని కొరడంతో ఎస్ఐ గ్రామానికి చెందిన పెద్దమనుషులను లోపలికి పిలిచి వారితో మాట్లాడారు. ఈ క్రమంలో బయట నిలబడిన పలువురు కాలనీ వాసులు తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఇళ్లకు వెళ్లేది లేదని భీíష్మించడంతో ఎస్ఐ వారితో మాట్లాడుతూ ఫాదర్‌ను పూర్తిస్థాయిలో విచారించి అతడిని కోర్టుకు పంపుతామని తెలిపారు. -
నన్‌పై రేప్ కేసులో మలుపు
హోషియార్పూర్/కొట్టాయం: నన్‌పై రేప్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ బాధితురాలి మద్దతు దారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జలంధర్ బిషప్‌గా ఉన్న కేరళకు చెందిన ఫ్రాంకో ములక్కల్ తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నన్ ఒకరు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) హోషియార్పూర్ సమీపంలోని దసుయ చర్చి ఆవరణలోని తన గదిలో సోమవారం అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. ‘గదిలో వాంతులు చేసుకున్న ఆనవాళ్లున్నాయి. వాటిని ల్యాబ్‌కు పంపాం. ఫాదర్ కట్టుత్తరా శరీరంపై ఎటువంటి గాయాలు లేవు’అని డీఎస్పీ ఏఆర్ శర్మ తెలి పారు. ఫాదర్ కట్టుత్తరా పదిహేను రోజుల క్రితమే భోగ్‌పూ ర్ చర్చి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు చర్చి సిబ్బంది తెలిపారు. బిషప్కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన ఫాదర్ కట్టుత్తరా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతుండేవారని ఆయన బంధువులు తెలిపారని డీఎస్పీ వెల్లడించారు. కొట్టాయంలోని కురవిలంగడ్ కాన్వెం ట్లో బాధిత నన్‌తోపాటు ఉంటున్న మరో ఐదుగురు నన్‌లు తమ ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిషప్ ములక్కల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఫాదర్ కట్టుత్తరా మృతి వెనుక మిస్టరీ ఉందన్నారు. ముల క్కల్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేసిన వారికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
దాడి ఘటనలో వ్యక్తి మృతి
కామారెడ్డి క్రైం: చర్చి ఫాదర్‌పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు చేసిన దాడిలో బాధితుడు గుండెపోటుకు గురై మరణించాడు. ఈ ఘటన కామారెడ్డిలో శనివారం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన వమ్య దేవసహాయం (42) కామారెడ్డి జిల్లా భిక్కనూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్. ఆయన భార్య మమత రామారెడ్డి పీహెచ్సీలో స్టాఫ్ నర్సు. వారు కామారెడ్డిలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వరుసకు బంధువైన సీఎస్ఐ చర్చి ఫాదర్ విల్సన్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఈనెల 4న మమత కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫాదర్ విల్సన్‌పై కేసు నమోదు చేశారు. అయితే, కేసును వాపస్ తీసుకోవాలంటూ ఒత్తిళ్లు రావడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి, శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న దేవసహాయం సోదరులు సాల్మన్, శ్యాంసన్, ప్రసాద్, ప్రసాద్ భార్య కేజియా శనివారం వేకువజామున ఇంటికి వచ్చారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. దేవసహాయం నిరాకరించడంతో దాడి చేసి కొట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో దేవసహాయం గుండెపోటుకు గురయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మరణించారు. దేవసహాయం మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి, పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్, ఎస్ఐ రవికుమార్‌లు సంఘటనపై విచారణ జరిపారు. -
భార్యను వేధిస్తున్న ఫాస్టర్‌కు దేహశుద్ది
-
పాస్టర్కు భార్య దేహశుద్ధి
వరంగల్: వరంగల్‌లో ఓ పాస్టర్కు దేహశుద్ధి జరిగింది. మొదటి భార్యతో విడాకులు తీసుకొని స్రవంతి అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని గత ఏడేళ్లుగా కాపురం చేస్తున్న అతడు నానారకాలుగా ఇబ్బంది పెడుతుండటంతో స్రవంతి ఆవేశం కట్టలు తెంచుకుని దాడి చేసింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం శనిగాపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామంలోని ఏసుదేవులు చర్చి ఫాదర్‌గా పనిచేస్తున్న రెవరెండ్ పద్మం నాగేంద్రపాల్ గత ఏడు సంవత్సరాలుగా భార్య స్రవంతితోకలిసి ఇదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా భార్యతో గొడవ పడటమే కాకుండా.. నువ్వు నా భార్యవు కావంటూ నిందింస్తున్నాడు. పైగా రోజూ ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోతుండటంతో వేరే వారి సహాయంతో బయటకు వచ్చిన ఆమె స్రవంతి మహిళా సంఘాలను ఆశ్రయించింది. నాగేంద్రపాల్ ఆదివారం చర్చిలో ప్రార్థనలు జరుపుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న స్రవంతి మహిళా సంఘాల నాయకులతో కలిసి చర్చి ముందు ధర్నాకు దిగింది. దీంతో గొడవకు దిగిన ఫాదర్‌కు స్రవంతికి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు. కాగా నాగేంద్రపాల్‌కు గతంలో వివాహం అయింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఏడేళ్లుగా స్రవంతి ఉంటున్నాడు. తాజాగా మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని స్రవంతి ఆరోపిస్తోంది. -
ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన ఫాదర్
చెన్నై: అమెరికాలో ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న చర్చి ఫాదర్ జోసెఫ్ పళనివేల్ జయపాల్‌ను ఆ దేశానికి అప్పగించాలంటూ ఢిల్లీ కోర్టు కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి చెందిన ఫాదర్ జోసెఫ్ 2004-05లో అమెరికాలోని మిన్నసోట్టా నగర్లో ఉండేవాడు. అక్కడి చర్చికి వచ్చిన 14, 16 ఏళ్ల చిన్నారులపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అత్యాచారం సంఘటనతో తీవ్ర అనారోగ్యానికి గురైన 14 ఏళ్ల బాలికను అక్కడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతుకాన్ని బయటకు చెబితే చిన్నారిని హతమారుస్తానని ఫాదర్ బెదిరించినట్లు మరో ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలను ఖండించిన జోసెఫ్ 2005లో భారత్‌కు చేరుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అమెరికాలోని రెసివ్‌కవుండి కోర్టు ఫాదర్ జోసెఫ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా 2010 డిసెంబరు 28న వారెంట్ జారీచేసింది. ఫాదర్‌ను అప్పగించాలని భారత విదేశాంగశాఖను అమెరికా కోర్టు 2011 ఫిబ్రవరిలో కోరింది. దీంతో విదేశాంగ శాఖ నవీన్ కుమార్ అనే ప్రత్యేక న్యాయవాదిని ఫాదర్ కేసు విషయమై నియమించింది. ఢిల్లీలోని అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఫాదర్‌పై నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవాలు ఉన్నట్లు కోర్టు అభిప్రాయపడుతున్నదని ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అజయ్‌కార్క్ వ్యాఖ్యానించారు. కాబట్టి అత్యాచార ఆరోపణలపై ఏ దేశం విచారణ కోరుతోందో ఆ దేశానికి (అమెరికా) ఫాదర్ జోసెఫ్‌ను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేజిస్ట్రేటు ఆదేశించారు. ఫాదర్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అక్కడి చట్టాల ప్రకారం 30 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. **