దీనితో రంగంలోకి దిగిన సీఐడీ, సంబంధిత సరోజ జైన్ నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసింది. సరోజ జైన్ నమో ఫౌండేషన్‌కు రూ.12.5లక్షలు విరాళంగా ఇచ్చారని, ఆ విరాళంతో ఏయే కార్యక్రమాలు చేశారో తెలిపాలని ఆమె అడిగినందుకు సంబంధిత ఫౌండేషన్ నిర్వహకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా మోదీ ఫోటో పెట్టి ఫౌండేషన్ పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిస్తున్నారని సీఐడీ గుర్తించింది. దీనితో విచారణ జరిపిన సీఐడీ శుక్రవారం దిల్‌షుక్‌నగర్‌లోని ఫౌండేషన్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి బాధ్యుడిగా ఉన్న పంకజ్ మెహ్తాను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.