సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బడ్జెట్, యురియ, ప్రజారోగ్యం, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్, నిరుద్యోగ భృతి, ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చ జరిగింది. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వ తీరును పలువురు నేతలు ప్రస్తావించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం, ఎరువుల కొరతపై రాష్ట్ర్ర ప్రభుత్వాన్నిఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీలు అని చెప్పారు కదా..ప్రెండ్లీ పార్టీలు అధికార, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అని ప్రశ్నలు సంధించారు. ఈ అంశంపై స్పీకర్‌కు లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment