వరిలో తాడుతో పువ్వు దులుపుతున్న గండ్ర
టేకుమట్ల : కొట్లాడి సాధించుకున్న ఉద్యమ రాష్ట్రంలో రైతులను పట్టించుకోకుండా నియంత పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రహీనుడయ్యాడని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని వెల్లంపల్లి, దుబ్యాల గ్రామాల్లో శుక్రవారం చేపట్టిన రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన రైతుల ఇంటికి, పంట పొలాల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర నిరంకుశ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రాజ్యాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇంతకుముందు, ఇకపై కూడా రైతు రాజ్యాన్ని తీసుకొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని సకాలంలో చేయకపోవడంతో రైతులకు మాఫీ అయిన వడ్డీల పేరుతో బకాయిలు పేరుకుపోతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొమ్మటి సాంబయ్య, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్షులు రెడ్డి మల్లారెడ్డి, ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొంరయ్య, ఎంపీటీసి భీంపెల్లి సంధ్యారామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి బిక్కినేని సంపత్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల మొగిళి, ఉపాధ్యక్షులు బాబురావు, వైనాల రవీందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సట్ల రవిగౌడ్, కోండ్ర ఓదెలు, గువ్వాడి లక్ష్మణ్, తోడేటి రవిందర్, పిన్నింటి విజేందర్‌రెడ్డి, దాసారపు సతీష్, యూత్ మండల అధ్యక్షుడు ఎండీ అక్రం, ఆడెపు సంపత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోటగిరి సతీష్‌గౌడ్, నానవేని కుమార్‌యాదవ్, నానవేని శ్రీకాంత్, రామస్వామి, పోషిని శ్రీని వాస్, నల్లబెల్లి పాల్గొన్నారు.
కేసీఆర్ గద్దె దిగడం ఖాయం
మొగుళ్లపల్లి: పంటలు పండక అప్పులపాలై అవస్థలు పడుతున్న రైతులను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని రైతుల ఉసురు, తగిలి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని మాజీ చిఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇప్పలపల్లి, అకినపల్లి, పోతుగల్లు, కోర్కిశాల గ్రామాలలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలోని రైతుల ఇంటికి, పంట పొలాల్లోకి నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment