సాక్షి, హైదరాబాద్: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని ఒక దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఏడాది భయానకంగా ఉంది: కేటీఆర్
‘వైజాగ్ గ్యాస్ లీకేజీ దృశ్యాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రు నివాళి. ఆసుపత్రుల్లో చేరిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ ఏడాది ఎంతో భయానకంగా ఉంది’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. గ్యాస్ లీక్ ఘటన పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహా విషాదం: డీజీపీ మహేందర్‌రెడ్డి
విష వాయువు లీకేజీ ఘటన మహా విషాదమని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. విష వాయువు పలువురు అమాయకులను బలి తీసుకున్న ఉదంతం తనను ఎంతగానో కలచి వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల
Comments
Please login to add a commentAdd a comment