గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం | CM KCR Met Governor Narasimhan At Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

Published Sun, Apr 14 2019 6:46 PM | Last Updated on Sun, Apr 14 2019 7:01 PM

CM KCR Met Governor Narasimhan At Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాల మార్పుపై ఈ సమావేశంలోచర్చించినట్లు తెలుస్తోంది. కాగా రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలు రూపొందించాలంటూ ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల్లో అవినీతి, లంచాల ఆరోపణలతో, ఈ శాఖలను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా శాఖల చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కసరత్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement