ముస్లిం రిజర్వేషన్: కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక చరిత్ర అని, అదేవిధంగా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- తెలంగాణ రాష్ట్రం రాదని.. ఒకవేళ వచ్చినా అనేక ఒడిదుడుకులు ఉంటాయని ఉద్యమసమయంలో అనేక దుష్ర్పచారాలు చేశారు.
- అదేవిధంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారు
- ఎన్నికల ప్రచారం సందర్భంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న అనేక సభల్లో నేను ఈ బిల్లుల గురించి ప్రకటించాను
- కొన్ని మీడియా చేసిన చర్చలో కూడా నేను ఆయా వర్గాలకు రిజర్వేషన్లను ఎలా సాధిస్తామో చెప్పాను
- గిరిజన రిజర్వేషన్, బీసీ-ఈ రిజర్వేషన్ అనేది కొత్త రిజర్వేషన్ కాదు
- ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకే వీటిని అమలు చేస్తున్నాం
- ఈ రిజర్వేషన్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
- ఎన్నికల ప్రచారంలోభాగంగా నేను 107 బహిరంగ సభలలో మాట్లాడాను
- ప్రతి సభలోనూ ఈ రిజర్వేషన్లను అమలు చేసితీరుతామని నేను కుండబద్దలు కొట్టాను
- మాకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ హామీని నెరవేర్చడం కర్తవ్యంగా భావిస్తున్నాం.
-
రెండు భిన్నమైన కమిషన్లు అధ్యయనం చేశాయి. సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్‌ను కల్పిస్తున్నాం. మత ప్రాతిపదికన కాదు. చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు కోరిన విధంగా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నాం.
కొత్తగా రిజర్వేషన్లు ఎందుకు తీసుకొస్తున్నామంటే..
‘కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక చాలా మార్పులు జరిగాయి. ఉమ్మడి ఏపీలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు ఆరుశాతం రిజర్వేషన్ ఇచ్చారు. తెలంగాణలో గిరిజనులు 9.08శాతం ఉన్నారు. రాష్ట్రంలోని వాల్మీకి బోయ కులాల వారు, కాగిత లాంబడి కులాల వారు తమను ఎస్టీలలో చేర్చాలని చాలాకాలంగా కోరుతున్నారు. వారిని కూడా కలిపితే పదిశాతంగా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరముంది. తెలంగాణ జనాభా నేపథ్యానికి అనుగుణంగా రిజర్వేషన్ కల్పిస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
దళితులకు సీఎం కేసీఆర్ తీపికబురు.. ఒకశాతం పెంపు
- తెలంగాణలోని దళిత జనాభాకు అనుగుణంగా వారికి ఒకశాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరముంది.
- ఇందుకు ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటుచేయబోతున్నాం. ఇందుకు కేబినెట్‌లో కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం
- ఈ రిజర్వేషన్ పెంచడం వల్ల బీసీలకు ఎలాంటి ముప్పు ఉండదు
- బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచుతాం.
- భిన్నత్వంలో ఏకత్వంతో ఉండే దేశం మనది. ఇంత భిన్నత్వంలోనూ ఐక్యత గల దేశంగా మనల్ని విదేశీయులు కొనియాడుతారు
- ఈ భిన్నత్వ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి.
- జనాభాలోని కంపోజిషన్‌కు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- ఈశాన్య రాష్ట్రాలలో 80శాతం గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. జార్ఖండ్‌లో 60శాతం, తమిళనాడులో 62శాతం, మహారాష్ట్రంలో 52శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది
- తెలంగాణకు 50శాతం రిజర్వేషన్ పరిమితి సరిపోదు
- ఆ తరహాలో 50శాతానికి మించి రిజర్వేషన్ పెంచడానికి కేంద్రం అనుమతించాలని కోరుతున్నాం
- స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా 70శాతం పెరిగింది. అనేక మార్పులు జరిగాయి.
- అట్టడుగున ఉన్నవారు తమ హక్కుల కోసం ఇప్పుడు పోరాటం చేస్తున్నారు
- సామాజిక పరిణితితో కేంద్రం ఆలోచించాలి
- ఆయా రాష్ట్రాలలోని ప్రజల సామాజిక జనాభా అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించాలి
- రిజర్వేషన్ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలి. రిజర్వేషన్ విషయంలో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
-
దీనివల్ల బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదు. జనాభాకు అనుగుణంగా బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచే ప్రతిపాదన ఉంది.