గవర్నర్‌ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం | cm kcr to meet governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం

Published Mon, Jun 15 2015 1:50 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

గవర్నర్‌ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం - Sakshi

గవర్నర్‌ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యే అవకాశముంది.  ఓటుకు కోట్లు వ్యవహారం కీలక స్థాయికి చేరుకుంటున్న వేళ జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత కన్పిస్తోంది. చంద్రబాబు, స్టీఫెన్‌సన్‌ మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో సీడీల కేసులో ఫోరెన్సిక్‌ నివేదిక త్వరలో రానుంది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఏసీబీ ఉంది.

ఈ క్రమంలో మొత్తం వ్యవహారాన్ని వివరించేందుకు గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్  భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు వ్యవహారంలో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంలో జోక్యం చేసుకునేందుకు కేంద్రం అంతగా ఆసక్తి చూపడం లేదు.  మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించే బాధ్యత  గవర్నర్‌ నరసింహాన్‌కే ప్రధాని మోదీకి అప్పగించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement