సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రూ.235 కోట్ల తో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణం, భూసేకరణ కోసం రూ.109 కోట్లు, టెంపుల్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.103 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3,000 మంది రుత్వికులు, 3,000 మంది వేద పారాయణదారులు, 3,000 మంది సహాయకులు యాగంలో పాల్గొననున్నారు. 1,048 కుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో యాగం తేదీలను కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment