
జయకు కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమె శుక్రవారం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ రోజు ఉదయం ఫోన్లో జయను అభినందించారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జయలలిత శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలుస్తారు. మరోవైపు సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.