ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావ్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కరోనా కట్టడిలో భాగంగానే ఆన్‌లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. మంగళవారం ఆయన చాంబర్ నుంచి ఆన్‌లైన్ వాట్సాప్ వీడియో కాల్‌లో ఫిర్యాదులు దారులతో ముఖాముఖీగా మాట్లాడారు. వివిధ జిల్లా, మండల కార్యాలయాలకు పనులు నిమిత్తం వచ్చే ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ విధానంతో అధికారులు కూడా ఇబ్బందులు ఉండవన్నారు. బాధితులు ఫిర్యాదులను వీడీయో కాల్ ద్వారా తెలియజేయవచ్చని, అవసరమైతే ఇతర అధికారులతో కూడా ఆన్‌లైన్‌లోనే వాట్సాప్ ద్వారా ఒకే సారి ముగ్గురు మాట్లాడేలా ప్రత్యేకమైన నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కవగా ప్రజలు వచ్చే జిల్లా కార్యాలయాలు, తహసీల్దార్లు ఎంపీడీఓలకు ఈ వాట్సాప్ వీడియో కాల్ చేసేందుకు ప్రత్యేకంగా సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇచ్చామన్నారు.
ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామన్నారు. వీడియా కాల్‌లో ఫిర్యాదుదారులు మాట్లాడిన అంతనరం తన సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వాట్సాప్ వీడియా కాల్ చేసిన నెంబర్లకే అప్లయ్ చేయవచ్చన్నారు. ఏ వారం íఫిర్యాదులను ఆ వారమే పరిష్కారిస్తామన్నారు. అవసరం అయితే ఫిర్యాదుదారుడి మొబైల్ నెంబర్ రికార్డు అయి ఉంటుందన్నారు. తరువాత కూడా వారి సమస్యను పరిష్కరించేందకు తిరిగి మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుదారులు సమస్య డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. తనతో నేరుగా వీడియో కాల్‌లో మాట్లాడుదలచుకున్న వారు 915446 3001నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్నాహ్నం 1గంట వరకు కాకుండా సాధారణ సమస్యల ఫిర్యాదులను అప్‌లోడ్ చేయవచ్చని తెలిపారు. వీలైనంత వరకు ప్రజలు కార్యాలయాలకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశామన్నారు. మొదటిసారి నిర్వహించిన ఆన్‌లైన్ వీడియా కాల్ ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.
21 ఫిర్యాదులు...
జిల్లావ్యాప్తంగా 21 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో జిల్లాస్థాయిలో 8, కలెక్టరేట్ జీబీసెల్‌కు 6, డీఆర్‌డీఓకు 1, జెడ్పీ సీఈఓ 1 ఫిర్యాదు వచ్చింది. మండలస్థాయిలో ప్రజావాణికి 13 మంది ఫిర్యాదులు అందాయి. ఇందులో అడ్డాకుల, సీసీకుంట, భూత్పూర్, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్ రూరల్, మిడ్జిల్, నవాబుపేట మండలం నుంచి ఒక్క ఫిర్యాదు రాలేదు. బాల్‌నగర్ 4, గండీడ్ 1, హన్వాడ 1, జడ్చర్ల 1, మహబూబ్‌నగర్ అర్బన్ 2, ముసాపేట 1, రాజాపూర్ 1 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో తహసీల్దార్లతో పనుల కోసం రాగా ఎంపీడీఓ కార్యాలయాలకు చెందిన పనులు మహబూబ్‌నగర్‌రూరల్, నవాబుపేట మండలం నుంచి మాత్రం ఒక్కొక్క ఫిర్యాదు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్‌ఓ స్వర్ణలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment