prajawani
-
కరోనా కట్టడికే ఆన్లైన్ ప్రజావాణి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కరోనా కట్టడిలో భాగంగానే ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. మంగళవారం ఆయన చాంబర్ నుంచి ఆన్లైన్ వాట్సాప్ వీడియో కాల్లో ఫిర్యాదులు దారులతో ముఖాముఖీగా మాట్లాడారు. వివిధ జిల్లా, మండల కార్యాలయాలకు పనులు నిమిత్తం వచ్చే ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ విధానంతో అధికారులు కూడా ఇబ్బందులు ఉండవన్నారు. బాధితులు ఫిర్యాదులను వీడీయో కాల్ ద్వారా తెలియజేయవచ్చని, అవసరమైతే ఇతర అధికారులతో కూడా ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా ఒకే సారి ముగ్గురు మాట్లాడేలా ప్రత్యేకమైన నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కవగా ప్రజలు వచ్చే జిల్లా కార్యాలయాలు, తహసీల్దార్లు ఎంపీడీఓలకు ఈ వాట్సాప్ వీడియో కాల్ చేసేందుకు ప్రత్యేకంగా సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇచ్చామన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజల ఫిర్యాదులను ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. వీడియా కాల్లో ఫిర్యాదుదారులు మాట్లాడిన అంతనరం తన సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వాట్సాప్ వీడియా కాల్ చేసిన నెంబర్లకే అప్లయ్ చేయవచ్చన్నారు. ఏ వారం íఫిర్యాదులను ఆ వారమే పరిష్కారిస్తామన్నారు. అవసరం అయితే ఫిర్యాదుదారుడి మొబైల్ నెంబర్ రికార్డు అయి ఉంటుందన్నారు. తరువాత కూడా వారి సమస్యను పరిష్కరించేందకు తిరిగి మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుదారులు సమస్య డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేసుకోవచ్చన్నారు. తనతో నేరుగా వీడియో కాల్లో మాట్లాడుదలచుకున్న వారు 915446 3001నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్నాహ్నం 1గంట వరకు కాకుండా సాధారణ సమస్యల ఫిర్యాదులను అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. వీలైనంత వరకు ప్రజలు కార్యాలయాలకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశామన్నారు. మొదటిసారి నిర్వహించిన ఆన్లైన్ వీడియా కాల్ ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. 21 ఫిర్యాదులు... జిల్లావ్యాప్తంగా 21 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో జిల్లాస్థాయిలో 8, కలెక్టరేట్ జీబీసెల్‌కు 6, డీఆర్డీఓకు 1, జెడ్పీ సీఈఓ 1 ఫిర్యాదు వచ్చింది. మండలస్థాయిలో ప్రజావాణికి 13 మంది ఫిర్యాదులు అందాయి. ఇందులో అడ్డాకుల, సీసీకుంట, భూత్పూర్, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్ రూరల్, మిడ్జిల్, నవాబుపేట మండలం నుంచి ఒక్క ఫిర్యాదు రాలేదు. బాల్నగర్ 4, గండీడ్ 1, హన్వాడ 1, జడ్చర్ల 1, మహబూబ్‌నగర్ అర్బన్ 2, ముసాపేట 1, రాజాపూర్ 1 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో తహసీల్దార్లతో పనుల కోసం రాగా ఎంపీడీఓ కార్యాలయాలకు చెందిన పనులు మహబూబ్‌నగర్‌రూరల్, నవాబుపేట మండలం నుంచి మాత్రం ఒక్కొక్క ఫిర్యాదు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్ఓ స్వర్ణలత పాల్గొన్నారు. -
సాకులు చెప్పొద్దు..
హన్మకొండ అర్బన్ : ‘ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది.. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి.. సాకులు చొప్పొద్దు’ అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అధికారులు ఎక్కువ మంది రామకపోవడంపై ఆరాతీసి హాజరు వివరాలను పరిశీలించారు. జెడ్పీ సమావేశం ఉండటంతో చాలా మంది అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలుపగా ఇకపై అధికారులు తప్పనిసరిగా గ్రీవెన్స్‌కు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలకు సంబంధించిన రాయితీ డబ్బులు నెల రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినా యూనిట్లు ఎందుకు గ్రౌండింగ్ చేయాలేదని అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మంగళవారం సాయంత్రం పత్య్రేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ రుణాల గ్రౌండింగ్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎంజీఎంలో సదరం క్యాంపుల నిర్వహణ, సర్టిఫికెట్ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌కు హాజరైన వివిధ శాఖల అధికారులు సదరం సర్టిఫికెట్ ఇప్పించండి తనకు ఆరు నెలల క్రితం పక్షవాతం రావడంతో రెండు కాళ్లు పూర్తిగా పనిచేయడం లేదు. మంచానికి పరిమితమయ్యాను. సదరం సర్టిఫికెట్ మంజూరు చేసి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన సులువూరి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. ఆలయ భూమిని కబ్జా చేస్తున్నారు హన్మకొండలోని వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయం సమీపాన 1145 సర్వే నంబర్లో ఉన్న కాకతీయుల కాలంనాటి బాలరాజరాజేశ్వర స్వామి దేవాలయం భూమిని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు. ఈవిషయంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకుని సుమారు 26 గుంటల భూమి కాపాడాలని కాయతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్ చీకటి రాజు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. -
ప్రజావాణి ఉన్నా లేనట్టే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజావాణిలో ముఖ్యమైన అధికారులు అందుబాటులో ఉండకపోవడంపై ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా మార్చి మూడో తేదీనుంచి ప్రజావాణి నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తిరిగి ప్రారంభమైంది. అయితే ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కొడుతుండడంతో ప్రజ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫిర్యాదులూ తక్కువగానే నమోదవుతున్నాయి. సోమవారం జడ్పీ సీఈ ఓ, ఇన్చార్జి ఏజేసీ రాజారాం ఫిర్యాదులు స్వీకరించారు. 64 ఫిర్యాదులే వచ్చాయి. ప్రైవేట్ ఆస్పత్రులను మూసి ఉంచడం వల్ల రోగులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య కు పరిష్కారం చూపాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకుడు వి.ప్రభాకర్ ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు డా క్టర్లు డబ్బే సర్వస్వంగా పనిచేస్తూ రోగులను పీడిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిన్న చిన్న వ్యాధుల కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకువచ్చి స్కానింగ్, ఇతర పరీక్షల పేరుతో అమాయకులను దోచుకుంటున్నారన్నారు. రోగి చనిపోయారన్న బాధతో వారి కు టుంబ సభ్యులు ఆవేదనకు లోనై దాడి చేస్తే ఆ స్పత్రులను మూసి ఉంచి రోగులందరినీ ఇబ్బం దులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలన్నారు.