కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజావాణిలో ముఖ్యమైన అధికారులు అందుబాటులో ఉండకపోవడంపై ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా మార్చి మూడో తేదీనుంచి ప్రజావాణి నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తిరిగి ప్రారంభమైంది. అయితే ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కొడుతుండడంతో ప్రజ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫిర్యాదులూ తక్కువగానే నమోదవుతున్నాయి.
సోమవారం జడ్పీ సీఈ ఓ, ఇన్‌చార్జి ఏజేసీ రాజారాం ఫిర్యాదులు స్వీకరించారు. 64 ఫిర్యాదులే వచ్చాయి. ప్రైవేట్ ఆస్పత్రులను మూసి ఉంచడం వల్ల రోగులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య కు పరిష్కారం చూపాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకుడు వి.ప్రభాకర్ ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు డా క్టర్లు డబ్బే సర్వస్వంగా పనిచేస్తూ రోగులను పీడిస్తున్నారని ఆరోపించారు.
కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిన్న చిన్న వ్యాధుల కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకువచ్చి స్కానింగ్, ఇతర పరీక్షల పేరుతో అమాయకులను దోచుకుంటున్నారన్నారు. రోగి చనిపోయారన్న బాధతో వారి కు టుంబ సభ్యులు ఆవేదనకు లోనై దాడి చేస్తే ఆ స్పత్రులను మూసి ఉంచి రోగులందరినీ ఇబ్బం దులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలన్నారు.
ప్రజావాణి ఉన్నా లేనట్టే..
Published Tue, May 27 2014 2:29 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement