మంత్రి జగదీశ్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: ఇంటర్‌మీడియట్ ఫలితాల విషయంలో తల్లిదండ్రులు కానీ విద్యార్ధులు కానీ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణ విద్యాశాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై మంత్రి ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతో ఈ అపోహలు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
అదే సమయంలో ఫలితాల విషయంలో చోటు చేసుకున్న అపోహలను తొలగించడానికి టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు, ఆ కమిటీలో వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్ బిట్స్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్‌లు సభ్యులుగా ఉంటారని మంత్రి వెల్లడించారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని, ఏ ఒక్క విద్యార్ధినీ నష్టపోనివ్వమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment