హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని, రుణ మాఫీ మొత్తాన్ని ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 19 నుంచి ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు మాత్రమే రూ. 6 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడం దారుణమని, జూన్ 2 నుంచి చనిపోయిన అందరి కుటుంబాలనూ ఆదుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. ఆత్మహత్యలపై అధికారులు ఇచ్చే నివేదికను కాకుండా గ్రామసభల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న పొన్నం.. ప్రభుత్వం స్పందించకుంటే రైతు కుటుంబాలను అసెంబ్లీకి తీసుకొచ్చి ధర్నా చేయిస్తామన్నారు.
పరిహారంపై ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం
Published Mon, Sep 21 2015 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement