
చార్జీల పెంపుపై ఆందోళనలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నారాయణపేట రూరల్: విద్యు త్, ఆర్టీసీ బస్ చార్జీల పెంపును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపల్లలో ఆయన మాట్లాడారు. కరువుతో తల్లడిల్లుతున్న ప్రజలపై ఒకేసారి రెండువైపులా చార్జీలను పెంచి భారం మోపడం తగదన్నారు.
చార్జీలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మిషన్ కాకతీయ పథకం అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్ననీటి ప్రాజెక్టులను విస్మరించి పెద్ద ప్రాజెక్టులపై దృష్టి సారించడం కాంట్రాక్టర్ల కోసమేనా అని ప్రశ్నించారు.