కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ధీమాతోనే ఉంది. కాకుంటే ఏ నిర్ణయం అయినా ఢిల్లీ అధిష్టానమే తీసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ తరహాలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తమకు కనీసం 50 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతును మిత్రపక్షమైన సీపీఐతో పాటు, పాతనేస్తం ఎంఐఎం నుంచి తీసుకోవాలని ఆపార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.
దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ‘ముఖ్య’మైన పదవి రేసులో ముందున్నారు. ఇప్పటికే ఆయన అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆ పార్టీ నేతలు వేస్తున్న అంచనాల ప్రకారం పాత కాపులతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి నందీశ్వర్‌గౌడ్ కూడా మంత్రి వర్గం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.