ఇంతకీ ఎటు! | Confused In the Medical Policy Academy Employees | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఎటు!

Published Mon, Feb 23 2015 5:48 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఇంతకీ ఎటు! - Sakshi

ఇంతకీ ఎటు!

జిల్లా ఆస్పత్రి తరలింపులో అయోమయం
- నిర్ణయం తీసుకోలేకపోతున్న ప్రజాప్రతినిధులు
- రోజుకో తీరుగా మారుతున్న అభిప్రాయాలు
- అయోమయంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు

నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎట్టకేలకు మెడికల్ కళాశాలకు అనుసంధా నం కావడంతో, జనరల్‌గా మారిన జిల్లా ఆస్పత్రిని ఎక్కడకు మారుస్తారో అన్న విషయంలో స్పష్టత రావడం లేదు. అటు ప్రజాప్రతినిధు లు, ఇటు ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోతున్నారు. దీంతో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కొందరు మెడికల్ కళాశాలకు వెళ్లడానికి సమ్మతి తెలుపుతున్నా, ఆస్పత్రి తరలింపు విషయం తేలే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ఆస్పత్రి మార్పు విషయంలో మూడేళ్లుగా సందిగ్ధం కొనసాగుతుంది.

గతంలో మంత్రిగా ఉన్న పి.సుదర్శన్‌రెడ్డి దీని ని బోధన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అపుడు  వైద్య విధాన పరిషత్ కమిషనర్ మూడు రోజులపాటు బోధన్‌లో ఉండి పరిశీలించారు కూడా. మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయి అనుమతి రాగానే బోధన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఈ పక్రియ నిలిచిపోయింది. మెడికల్ కళాశాలకు అనుమతులు కూడా ఆలస్యంగా రావడంతో ఆస్పత్రి మార్పులోనూ ఆలస్యం జరిగింది.
 
బోధన్‌కా... బాన్సువాడకా?
గతంలో ఉన్నతాధికారులు జిల్లా ఆస్పత్రిని బోధన్‌కు తరలించాలనే అనుకున్నారు. అరుుతే, ప్రస్తుతం దీనిని వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బాన్సువాడకు తరలించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడకు చెందినవారు కాబట్టి ఆస్పత్రిని తన నియోజకవర్గానికి తీసుకెళుతున్నారని భావిస్తున్నారు. 15 మండలాలు బాన్సువాడకు దగ్గరగా ఉంటాయి. జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బాన్సువాడకు ఆస్పత్రిని తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఆ స్పత్రిని కామారెడ్డికి తరలించాలని వైద్యాధికారులు ఉన్నతాధికారులకు నివేదిం  చారు. కామారెడ్డి పట్టణం బాన్సువాడ కన్న పెద్దదిగా ఉండడం, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నందున ఈ అంశాన్ని పరిశీలించాలని విన్నవించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో వెయి పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణరుుంచినందున జిల్లా ఆస్పత్రి తరలింపు ఉండబోదనే వాదనా వినిపిస్తోంది. కొత్తగా నిర్మించే ఆస్పత్రులలోనే ఆధునిక సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం భావి  స్తున్నట్లు సమాచారం. కాగా, బాన్సువాడకు జిల్లా ఆస్పత్రితో తరలింపుతోపాటు అక్కడ వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని కూడా మంత్రి ఆలోచిస్తున్న   ట్లు తెలిసింది. దీనికి తోడు సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్, మద్నూరు, పిట్లం, బిచ్కుంద, ఇతర మండలాల ప్రజలకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
 
అయోమయంలో ఉద్యోగులు
జిల్లా ఆస్పత్రి తరలింపుపై తుది నిర్ణయం రాకపోవడంతో వైద్యా విధాన పరిషత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో 23 మంది ఉద్యోగులు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో 211 మంది సిబ్బంది ఉన్నారు. 43 మంది స్టాఫ్ నర్సులు, ఆరుగురు హెడ్‌నర్సులు ఉన్నారు. ఇందులో కొందరు మెడికల్ కళాశాలకు వెళ్లేందుకు సమ్మతి తెలిపారు. మరి     కొందరు వైద్య శాఖలోని ఇతర విభాగాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇదిలా ఉం    డగా, ఉద్యోగులకు మరో రెండు, మూడు రోజులలో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 
జిల్లా ఆస్పత్రి ఇక జనరల్
బాన్సువాడ : జిల్లా కేం ద్రంలో ఉన్న ఆస్పత్రిని జ నరల్ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా ఆస్పత్రిగానే ఉన్న దీనిని నిజామాబాద్ మెడికల్ కళాశాలలో విలీనం చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులతోపాటు సిబ్బందిని వారి సమ్మతితోనే త్వరలో కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉంటారా? ఇతర ఏరియా ఆస్పత్రులకు వెళ్తారా అనేది వైద్యులతోపాటు సిబ్బందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మెడికల్ కళాశాల ప్రారంభమై రెండేళ్లవుతుండగా, ఎట్టకేలకు ప్రస్తుతం ఆస్పత్రిని జనరల్ హాస్పిటల్‌గా మార్చారు. దీంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిని బాన్సువాడకు తరలించేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement