వైఎస్సార్ హయాంలోనే భూపంపిణీ : కుంతియా
నిజామాబాద్: తెలంగాణలో భూ పంపిణీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ బూత్ కమిటీ మెంబర్స్ కు నిర్వహించిన ఇందిరమ్మ రైతు బాట అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ కొత్తగా తెలంగాణలో ఎక్కడా భూపంపిణీ చేయలేదని తేల్చి చెప్పారు. బూత్ లెవల్ లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గద్దె దిగడం, 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.