కామారెడ్డి: కరెంటు కోతలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన భరోసా యాత్ర నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లోని బస్వాపూర్ వద్ద మొదలై రామేశ్వర్‌పల్లిలో ముగిసింది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలి విపక్ష నేత డి. శ్రీనివాస్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ అధ్వర్యంలో నిర్వహించిన భరోసాయాత్రలో రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ యాత్రలో జిల్లాలోని ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. బస్వాపూర్ వద్ద ఉన్న జై కా హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన రైతులతో నేతలు మాట్లాడారు. ఇ టీవల ఆత్మహత్యకు పాల్పడిన బస్వాపూర్ గ్రామానికి చెందిన రైతు మన్నె నారాయణ భార్య లక్ష్మిని పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకు న్నారు.
ఆమెకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. అక్కడి నుంచి బయలుదేరి భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి శివారులోని ఎండిపోయిన తూర్పు కిష్టయ్య వరిపొలాన్ని పరిశీలించారు. పక్కనే రాములకు చెందిన ఎండిపోయిన మక్కచేనుకు వెళ్లి పరిశీలించి రాములు కుటుంబ సభ్యులతో మాట్లాడా రు. అదే గ్రామ శివా రులో ఇటిక్యాల సురేందర్‌రెడ్డి అనే రైతు జనరేటర్ సాయంతో పంటకు నీరందిస్తుం డగా అక్కడికి వెళ్లి మాట్లాడారు. ఖర్చు ఎక్కువైనా కనీసం తిండిగింజలైనా సంపాదిద్దామని అద్దెకు జనరేటర్‌ను తెచ్చినట్టు రైతు నేతలకు వివరించారు. అక్కడి నుంచి దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామం మీదుగా సీతారాంపల్లి శివారులో ఎండిపోయిన మక్క పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేతలు మాట్లాడారు.
అక్కడి నుంచి దోమకొండ మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చేరుకుని విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం భోజనాలు చేసి హైదరాబాద్‌కు నేతలు తిరుగు పయనమయ్యారు. కాగా కాంగ్రెస్ నేతలు చేపట్టిన భరోసా యాత్రతో జిల్లాలోని
కాం గ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
భరోసా యాత్రలో మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్, మహిళా కాంగ్రెస్ రాష్ట అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగారాం, కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, నల్లమడుగు సురేందర్, తాహెర్‌బిన్ హందాన్, మహేశ్‌కుమార్‌గౌడ్, ఎడ్ల రాజిరెడ్డి, నల్లవెల్లి అశోక్, నిజ్జెన రమేశ్, నర్సింగ్‌రావ్, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, చంద్రకాంత్‌రెడ్డి, జమునారాథోడ్, పంపరి శ్రీనివాస్, రేఖ, ఇంద్రకరణ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, తిర్మల్‌గౌడ్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ సుష్మ, మాజీ చైర్మన్లు కైలాస్ శ్రీనివాస్, మామిండ్ల లక్ష్మి, సీడీసీ చైర్మన్ కారంగుల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల భరోసా యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భిక ్కనూరు, కామారెడ్డి రూరల్ సీఐలు శ్రీధర్‌కుమార్, కోటేశ్వర్‌రావ్‌లతో పాటు ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు. భరోసా యాత్ర కొనసాగిన అన్ని రోడ్లపై పోలీసులు బందోబస్తు నిర్వహించారు.