అన్నదాతల కష్టాలను విన్న టీపీసీసీ నేతలు
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, భిక్కనూరు మండలాలలోని ఎండిన పొలాలలో తిరుగుతూ కాంగ్రెస్ నేతలు రైతులలో కలిసిపోయారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల కడుపుమంట సర్కారుకు మంచిది కాదన్నారు. కరువు, కరెం టు కోతలపై కాంగ్రెస్ చేపట్టిన భరోసాయాత్రలో భాగంగా గురువారం టీపీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు జానారెడ్డి, డీఎస్, షబ్బీర్‌అలీ, కోదండరెడ్డి జిల్లాలో పర్యటించారు. మొదట భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఎండిపోయిన తూర్పు కిష్టయ్య పంట పొలంలోకి వెళ్లి రైతుతో మాట్లాడారు. కరెంటు కొరతతోనే తన పొలం ఎండిపోయిందని కిష్టయ్య ఆవేద న వ్యక్తం చేశాడు.
తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. దీం తో షబ్బీర్‌అలీ, పొన్నాల రైతును సముదాయించారు. ఆత్మహత్య ఆలోచన రానీయొద్దని, తాము అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. పక్కనే ఎండిపోయిన మక్కచేనులోకి వెళ్లి రైతు చెట్కూరి లింగంతో మాట్లాడారు. రాములు అనే రైతు మాట్లాడుతూ కరెంటు రెండు గంటలు కూడా సక్కంగ అస్తలేదని వారి దృష్టికి తెచ్చాడు.
ఇక్కడే వర్షపాతం తక్కువ
అనంతరం శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత డీఎస్ మాట్లాడుతూ జిల్లాలోనే దోమకొండ, భిక్కనూరు మండలాలలో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. కరెంటు సక్రమంగా ఇచ్చి ఉంటే రైతులు ఇబ్బందులు పడేవారు కాదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైలు ఢీకొని విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రాలేదని, రైతు లు ఆత్మహత్య లు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల కష్టాలను చూసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నా రు. ఎమ్మె ల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుం దన్నారు. ఇద్దరు చంద్రులతో దేవుడు కూడా నారాజ్‌గా ఉన్నాడన్నారు. ఎవరూ ఆ త్మహత్యలకు పాల్పడవద్దంటూ చేతులెత్తి వేడుకున్నారు.
రైతుల దీనావస్థను చూడడానికే
సీతారాంపల్లి శివారులో మక్కచేనులోకి వెళ్లిన నేతలు ఎండిపోయిన పంటలను పరిశీలించారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ రైతుల దీనావస్థను చూడడానికే తాము భరోసాయాత్ర చేపట్టామన్నారు. ఏడుగంటల కరెంటు ఇస్తామని మూడు గంటలైనా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కరవు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో, శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీని వెంటనే అమలుచేసి, రైతులకు కొ త్త రుణాలు ఇవ్వాలన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు.
ప్రతిపక్షాలను తి ట్టడమే తప్ప ప్రభుత్వ పెద్దలు చేసిందే మీ లేదన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఎనిమిది గంటల కరెంటు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు మూడేండ్ల దాకా కరెంటు కష్టాలు గిట్లనే ఉంటాయనడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. బంగారు తె లంగాణ అనుకుంటే బాధల తెలంగాణ చేస్తున్నడని దుయ్యబట్టారు. గాలిమాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని హెచ్చరించారు. సీతారాంపల్లిలో ఎండిపోయిన మక్క చేనులో తిరుగుతూ రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుగుముఖం పట్టారు.