సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యో గులకు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. 2005లో నియమితులై ఇప్పటివరకు రిమార్క్ లేకుండా పనిచేస్తున్న వారందరినీ కొనసాగించాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2012–13లో వచ్చిన నియామక మార్గదర్శకాలతో ప్రమే యం లేకుండా వీరి సర్వీసులను క్రమబ ద్ధీకరించే విషయాన్ని పరిగణనలోకి తీసు కోవాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఖాళీ లు ఏర్పడితే వాటిని 2012–13 మార్గదర్శ కాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగు ణంగా భర్తీ చేసు కోవచ్చని సూచించింది.
న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు గత వారం తీర్పు వెలువరించారు. కేజీబీవీల్లో మహిళలనే ఉద్యోగులుగా నియ మించుకోవాలని.. పురుషులకు కేజీబీవీల్లో నివాసం ఉండేందుకు అనుమతి నివ్వరా దని 2012–2013లో కేంద్రం మార్గ దర్శకా లు జారీ చేసిందన్న కారణంతో తమను తొలగించి, తమ స్థానాల్లో ఔట్ సోర్సింగ్ కింద నియామాకాలు చేపట్టేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన పలు సర్క్యు లర్లను సవాలు చేస్తూ కాంట్రాక్టు ఉద్యో గులు హైకోర్టును ఆశ్రయించారు.
నిరుపేదలకే అసైన్డ్ భూములు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు అసైన్డ్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అసైన్డ్ భూముల్లో ప్రస్తుతం కబ్జాలో ఉన్న వారికి మాత్రమే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అసైన్డ్‌భూముల్లో కబ్జాలో ఉన్న వ్యక్తుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం ఈ భూములను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి అసైన్డ్ చేయనున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట
Published Thu, Dec 21 2017 4:39 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment