
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను అప్పగించాలని కరోనా బాధితుడు మధుసూదన్ భార్య మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాధవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డాక్టర్లు తన భర్తకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారని మాధవి తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మధుసూదన్‌ను ప్రాణాలతో అప్పగిస్తే సీఎం కేసీఆర్‌ను సన్మానిస్తానని తెలిపారు. మధుసూదన్‌కు ఎం జరిగినా అది ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు. మరణాలు పెరగాలని ఎవరు కోరుకోరని.. మధుసూదన్ విషయంలో ప్రభుత్వం వాదనకు, గాంధీ ఆస్పత్రి రికార్డులకు పొంతన కుదరడం లేదని విమర్శించారు. (చదవండి : నా భర్త జాడ చెప్పండి!)
కాగా, మధుసూదన్ కుటుంబంలో పలువురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మాధవి కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఇంటికి వెళ్లిన మాధవికి తన భర్త కనిపించకపోవడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. వైద్యులు తన భర్త బతికే ఉన్నాడని చెప్పారని అన్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మధుసూధన్ చికిత్స పొందుతూ మరణించాడని స్పష్టం చేశాయి. కుటుంబ సభ్యుల సూచనల మేరకే ఈ విషయాన్ని మాధవికి చెప్పలేదని వెల్లడించాయి. మరోవైపు మాధవి మాత్రం తన భర్త జాడ చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment