
రాజాపేట సంతలో కోళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్న ప్రజలు
సాక్షి, రాజాపేట(ఆలేరు) : కరోన వైరస్ ప్రభావంతో పౌల్ట్రీ రైతులు కోత దశకు వచ్చిన కోళ్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోవడం, కొనుగోలు చేసేవారు లేకపోవడంతో వ్యాన్లలో సంతకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి ఎంతోకొంత నష్టాన్ని అధిగవిుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాజాపేట సంతలో ఓ వ్యాపారి రూ.25కు రెండు కిలోల కోడి, రూ.50కి రెండు కోళ్ల చొప్పున విక్రయించాడు. దీంతో సంతకు వచ్చిన వారు కొనుగోలు చేస్తున్నారు. (వదంతులు కూత వేసే... పౌల్ట్రీ పల్టీ కొట్టె!)
Comments
Please login to add a commentAdd a comment