
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2698 కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 122, రంగారెడ్డి 40, మేడ్చల్ 10, ఖమ్మం 9, మహబూబ్‌నగర్, మెదక్, జగిత్యాలలో 3 చొప్పున, వరంగల్ అర్బన్ 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వలసదారుల్లో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ఇవాళ ఐదుగురు కరోనా బాధితులు ప్రాణాలు విడువడంతో.. మొత్తం మృతుల సంఖ్య 82కు చేరింది. తాజాగా 16 మంది కోలుకోవడంతో.. వైరస్ బారినపడి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1428 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 1188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
(చదవండి: వేదికపైనే తిట్టుకున్న జగదీష్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్)
Comments
Please login to add a commentAdd a comment