‘గ్రేటర్‌’పై కొనసాగుతున్న కరోనా పంజా  | Coronavirus Cases Huge Expansion In Greater Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై కరోనా పంజా 

Published Tue, Jun 9 2020 8:10 AM | Last Updated on Tue, Jun 9 2020 9:20 AM

Coronavirus Cases Huge Expansion In Greater Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌) : గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతునే ఉన్నాయి. సోమవారం కింగ్‌కోఠి ఆస్పత్రి ఓపీకి 202 మంది రోగులు రాగా, వీరిలో 32 మందిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్‌ చేశారు. ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న 24 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన 18 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 88 మంది అనుమానితులు ఉన్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ ఫీవర్‌ ఆస్పత్రికి 56 మంది రాగా, వీరిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉన్న 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 64 మంది అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి స్వల్ప లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 393 మందిని డిశ్చార్జ్‌ చేసి, హోం క్వారంటైన్‌కు తరలించారు. (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ)

బంజారాహిల్స్‌లో ఏడుగురికి పాజిటివ్‌ 
జూబ్లీహిల్స్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సయ్యద్‌నగర్‌కు చెందిన మహిళ(37) తల్లికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జి అయింది. సోమవారం ఆమె కుమార్తెకు కరోనా పాజిటివ్‌ రావడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎంపీ మురళీమోహన్‌ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు భార్యా, భర్తలు కాగా మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన వృద్ధుడికి(75), బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

జవహర్‌నగర్‌ వాసికి.. 
జవహర్‌నగర్‌: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి (49)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. శివాజీనగర్‌కు చెందిన వ్యక్తి గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఉస్మానియా ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో శివాజీనగర్‌లోని అతడి కుటుంబసభ్యులను అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు.  

జూబ్లీహిల్స్‌ పరిధిలో ఇద్దరు.. 
వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌–19 పరిధిలో ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. జవహర్‌నగర్‌ బస్తీకి చెందిన యువకుడు(27),  హైలాంకాలనీకి చెందిన వ్యక్తి (54)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  

మరో ముగ్గురికి... 
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో సోమవారం మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. సుదర్శన్‌నగర్‌ కాలనీకి చెందిన మహిళ(46), మియాపూర్‌ న్యూకాలనీకి చెందిన యువకుడు(26), ఇజ్జత్‌నగర్‌కు చెందిన వ్యక్తి( 35) కరోనా బారిన పడ్డారు. 

మీర్‌పేటలో ఇద్దరికి.. 
మీర్‌పేట: మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో సోమవా రం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కాలనీకి చెందిన మహిళ(45)కు, జిల్లెలగూడ దాసరి నారాయణరావుకాలనీకి చెందిన బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి (35) కరోనా పాజిటివ్‌ రావడంతో వారి ఇళ్లను క్వారంటైన్‌ చేశారు. 

‘ఫీవర్‌’లో 13 మందికి పాజిటివ్‌  
నల్లకుంట: నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో సోమవారం 54 కోవిడ్‌–19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. పాత కేసులతో కలిపి ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో 64 మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నమోదైన అనుమానితుల్లో మొత్తం 13 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ 
బహదూర్‌పురా: కిషన్‌బాగ్‌ డివిజన్‌లోని అసద్‌బాబానగర్‌లో ఓ వృద్ధుడి (65)కి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. బహదూర్‌పురా పీఎస్‌లో కానిస్టేబుల్‌కు (52)కు కూడా ఆదివారం రాత్రి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.    
ముషీరాబాద్‌లో మరో 9 పాజిటివ్‌ కేసులు 

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో సోమవారం మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాంనగర్‌ మీ–సేవా వద్ద నిమ్స్‌లో పనిచేసే ఓ నర్సుకు కరోనా సోకగా, సోమవారం ఆమె సోదరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కవాడిగూడకు చెందిన మహిళ(34)  గాంధీనగర్‌లో  (65) ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఉస్మానియా ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తూ ఫ్రెండ్స్‌కాలనీలో ఉంటున్న యువకుడి(24)కి, భోలక్‌పూర్‌లో ఓ వ్యక్తికి (53, అడిక్‌మెట్‌ లలితానగర్‌లో మరో వ్యక్తి(48)కి పాజిటివ్‌ వచ్చింది. బీర్బన్‌గల్లీలో ఉంటున్న హౌస్‌ సర్జన్‌(26)కు, భోలక్‌పూర్‌కు చెందిన (52) వ్యక్తికి, లలితానగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కరోనా బారిన పడ్డారు.  

మున్సిపల్‌ బిల్లు కలెక్టర్‌కు.. 
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సర్కిల్‌లో బిల్లు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు సదరు బిల్లు కలెక్టర్‌కు ఎవరి నుంచి వ్యాధి సోకిందనే వివరాలు సేకరిస్తున్నారు.  

వైద్యుడికి కరోనా పాజిటివ్‌ 
గౌతంనగర్‌: మిర్జాల్‌గూడ రాజా శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వైద్యుడికి (30) కరోనా నిర్ధారణ అయ్యింది. అతను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో విధులు అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement