సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాపై చేస్తున్న యుద్ధంలో నగరానికి చెందిన పలు ఫార్మా కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. వ్యాధి ఉధృతిని కట్టడిచేసే రెమ్డిసివిర్ ఔషధాన్ని సుమారు పది లక్షల డోసుల మేర తయారుచేసే బాధ్యతను ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో స్వీకరించింది. వచ్చే నెలలో అమెరికాకు చెందిన గిలాడ్ సైన్సెస్ సౌజన్యంతో ఈ ఔషధాన్ని తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే అవకాశాలున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి.
ఇక కరోనా నియంత్రణకు వాడే లోపినవిర్, రిటొనవిర్ ఔషధాల తయారీలో నగరానికి చెందిన అరవిందో ల్యాబ్స్ సహా పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఏర్పాటుచేసిన బృందంలో నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు చోటుదక్కింది. వ్యాక్సిన్ మరో 3–4 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్టు కంపెనీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మహానగరం పరిధిలో 1,500కు పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ కంపెనీలు ఉన్నాయి.
దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు పలు ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే, వైరస్ సంబ ంధిత జబ్బులను నియంత్రించే మందుల తయారీ బాధ్యతలకు నగరంలోని పలు ఔషధ కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల పాటు పనిచేసేలా ఈ కం పెనీలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఏటా బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను మన నగరంలోని ఫార్మా కం పెనీలు దేశవిదేశాలకు ఎగుమతిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment