సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కేన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బుల పేషెంట్లు తమ రెగ్యులర్ మందులను క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా మందుల వాడకంపై ఆంక్షలేమీ లేవు. టీకా తీసుకున్నాక డాక్టర్లతో సహా చాలా మందికి జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తున్నాయి. కొందరికైతే 2, 3 రోజుల పాటైనా ఈ లక్షణాలు తగ్గడం లేదు. అందువల్ల పారాసిటమాల్ ఇతర పెయిన్ కిల్లర్లు వాడాల్సి వస్తోంది.
ఈ మందులు వాడడం వల్ల ప్రయోజనమే తప్ప ప్రమాదమేమీ లేదు. కేన్సర్ బాధితుల్లో కీమో, ఆపరేషన్, రేడియేషన్ ఇతర ట్రీట్‌మెంట్ కొనసాగుతున్న వారు మినహా అందరూ టీకా తీసుకోవచ్చు. రోగనిరోధకశక్తి తక్కువ ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలుంటాయి. తీవ్రమైన గుండె జబ్బులున్నవారు, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా టీకా వద్దన్న అభిప్రాయాలు ఉన్నాయి. కోవిడ్ వ్యాధి రక్తాన్ని గడ్డ కట్టిస్తోంది కాబట్టి టీకా వేసుకున్నాక కూడా కార్డియక్ పేషెంట్లు రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆపకుండా కొనసాగించాల్సిందే.
వాటిని ఆపడం వల్లనే హార్ట్ పేషెంట్లకు సమస్యలు వస్తున్నాయి. తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం వంటివి కేన్సర్ పేషెంట్లతో సహా అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. కేన్సర్ పేషెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకుని చికిత్సను తప్పకుండా కొనసాగించాలి. లేనిపక్షంలో శరీరంలో వ్యాధి వ్యాప్తి మరింత పెరగొచ్చు. దాని వల్ల ప్రమాదం పెరిగే అవకాశాలు ఉంటాయి.
-సౌమ్య కోరుకొండ
కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్,
యశోదా ఆస్పత్రి
చదవండి:
డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే ?
టీకా వేసుకున్నా కరోనా వస్తుందా? వస్తే రెండో డోసు పరిస్థితి ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment