సాక్షి, హైదరాబాద్: వైరస్‌లు, అంటురోగాల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడే వ్యాక్సిన్ విలువ వెలకట్టలేనిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ప్రపంచంలో దాదాపు 2 కోట్ల మంది చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. ఈ నెల 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది.
ఈ వారోత్సవాల్లో మానవ శరీరాన్ని రోగనిరోధకంగా మార్చేందుకు అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలను మానవాళికి తెలపాలని సూచిం చింది. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్లు చాలా విలువైనవని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ప్రపంచంలో వ్యాక్సిన్ల కొరతకు గల కారణాలను విశ్లేషించి అంతరాన్ని తొలగించాల్సిన ఆవశ్యకతను ఈ వారోత్సవాల్లో గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరింది. ఈ ఏడాది రోగనిరోధక వారోత్సవాలు ప్రతి ష్టాత్మకంగా నిర్వహించాలని కోరింది. ‘వ్యాక్సిన్ ఫర్ ఆల్’ నినాదంతో ముందుకెళ్లాలని, ప్రపంచంలో అందుబాటులోకి రావాల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలను ప్రజలకు తెలపాలని పిలుపునిచ్చింది.
వ్యాక్సిన్.. వెలకట్టలేనిది
Published Thu, Apr 16 2020 2:59 AM | Last Updated on Thu, Apr 16 2020 2:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment