అందించాలని వైద్యారోగ్య మంత్రిని కోరిన పీఆర్‌టీయూ, ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్ కోరారు.
ఔట్ పేషెంట్ సదుపాయం కూడా కల్పించేలా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయులంతా నెలవారీ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మూడుసార్లు మాట్లాడామని, చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీల రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారని వారు పేర్కొన్నారు.
హెల్త్ కార్డులతో ‘కార్పొరేట్’ చికిత్స
Published Tue, Nov 1 2016 3:08 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement