హాలియ: అప్పుల బాధ ఎక్కువై ఓ పత్తి రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బల్లు(48) అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పత్తి పంట ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో రెండు మూడు రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో పత్తిరైతు మృతి
Published Thu, Jan 7 2016 11:47 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement