ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కిష్టారంలో అప్పుల పాలైన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కిష్టారంలో అప్పుల పాలైన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. చింతా రమేష్ నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇందుకోసం రూ.లక్ష వరకు అప్పు చేశాడు. పత్తి పంటలో పిందెలు రాకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్ సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.