కొనసా..గుతున్న లెక్కింపు
మందకొడిగా ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు తొలి రౌండ్ ఫలితం వెల్లడి
1.30 గంట వరకు నాలుగు రౌండ్లు పూర్తి
స్వతంత్రుల ప్రభావం నామమాత్రమే
తుది ఫలితం నేటి మధ్యాహ్నానికి వెల్లడి!
నల్లగొండ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. నల్లగొండలోని నాగార్జున జూని యర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రా రంభం కాగా, రాత్రి 11 గంటలు ముగిసే సమయానికి వెల్లడైంది కేవలం రెండు రౌండ్ల ఫలితాలే. ఈ రెండు రౌండ్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. రాజేశ్వర్‌రెడ్డికి రెండు రౌండ్లలో కలిపి 7,418 ఓట్లు రాగా, ఆయన సమీప ప్ర త్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావుకు 5,761 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీ న్మార్ మల్లన్నకు 1,875 ఓట్లు, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డికి 1,875 ఓట్లు లభిం చాయి. 1,815 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. స్వతంత్రులకు నామమాత్రంగానే ఓట్లు లభించినా, చెల్లిన ఓట్లలో నా లుగు శాతం అంటే ప్రతి 100 మందిలో ఒకరికి అభ్యర్థు లు ఎవరూ నచ్చక నోటాకు ఓట్లు పడ్డాయి. ఇంకా 18 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా, తుది ఫలి తం గురువారం మధ్యాహ్నానికి వచ్చే అవకాశాలున్నా యి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలని పక్షంలో ఈ ఫలితం మరింత ఆలస్యం కానుంది.
కట్టలు కట్టడానికే చాలా సమయం
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో గణనీయంగా ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2.81 లక్షల ఓట్లకు 1.53 లక్షల ఓట్లు నమోదయ్యాయి. వీటి లె క్కింపు కోసం అధికారులు చేసిన ఏర్పాట్ల కారణంగా లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతోంది. లక్షన్నరకు పైగా ఓట్లు లెక్కించేందుకు కేవలం 20 టేబుళ్లే ఏ ర్పాటు చేయడంతో ఆలస్యంగా అవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి 1.10 ల క్షలే పోల్‌కాగా, అక్కడ 28 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించారు. కానీ, ఇక్కడ 40 వేల ఓట్లు అదనంగా పో లైతే, 8 టేబుళ్లు తగ్గించి ఏర్పాట్లు చేయడం గమనార్హం. దీంతో లక్షన్నర ఓట్లను కట్టలు కట్టేందుకే దాదాపు 10 గంటల సమయం పట్టింది. ఉదయం 8 గంటలకు ప్రా రంభమైన కట్టలు కట్టే కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఆ తర్వాత ఆరున్నర గంటలకు తొలి రౌండ్ ప్రారంభం కాగా, లెక్కింపు పూర్తయ్యే సరికి ఎనిమిది గంటలైంది.
ఒక్కో టేబుల్‌కు 500 ఓట్ల చొ ప్పున రౌండ్‌కు 10,000 ఓట్లను లెక్కించారు. కానీ, అన్నీ లెక్కలు చేసుకుని తొలి రౌండ్ ఫలితాన్ని ప్రకటిం చేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది. అంటే కౌంటింగ్ ప్ర క్రియ ప్రారంభమైన తర్వాత కట్టలు కట్టడం పూర్తయి తొలి రౌండ్ ఫలితం ప్రకటించేందుకు 13 గంటల స మయం పట్టిందన్నమాట. దీనికితోడు తొలిరౌండ్ పూ ర్తయిన తర్వాత కౌంటింగ్ సిబ్బంది షిఫ్ట్ మార్చడంతో రెండో రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కావడానికి మరో గంట సమయం పట్టింది. షిఫ్ట్ మారిన సిబ్బందికి మళ్లీ సూచనలు చెప్పి రెండో రౌండ్ ప్రారంభించాల్సి వచ్చింది.
చెల్లని ఓట్లు పది శాతం
పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగంలో ఉ న్న చైతన్యం అంతంతమాత్రమేనని తేలింది. పోలైన ఓట్లలో దాదాపు 10 శాతం ఓట్లు చెల్లలేదంటే పట్టభద్రు లు ఓటు హక్కు ఎలా వినియోగించుకున్నారో అర్థం చే సుకోవచ్చు. ప్రాధాన్యతా క్రమంలో కేవలం 1, 2, 3 నంబర్లు మాత్రమే వేయాల్సి ఉండగా, టిక్కులు పె ట్టడం, ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వడం, నంబర్ వేసి మళ్లీ టిక్ పెట్టడం, నోటాకు పెట్టి మళ్లీ అ భ్యర్థికి టిక్‌పెట్టడం లాంటి కారణాలతో ఓట్లు చెల్లకుం డా పోయాయి. తొలిదశలో వెల్లడైన ఫలితాలను పరి శీలిస్తే ప్రతిపక్షం ఓట్లు బలంగా చీలినట్టు అర్థమవుతోం ది. అందరూ భావిస్తున్న విధంగానే బీజేపీ అభ్యర్థి రా మ్మోహనరావు రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్, వా మపక్షాల అభ్యర్థులు కూడా గణనీయంగానే ఓట్లు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది. దీనికి తోడు అధికార టీఆర్‌ఎస్ హవా కూడా కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజే శ్వర్‌రెడ్డి తొలి రౌండ్ నుంచి మెజారిటీలోనే ఉన్నారు. ఇంకా 18 రౌండ్లు మిగిలి ఉండడంతో ఇంకా ఏదైనా జరుగుతుందేమో అనే అంచనాలున్నా టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.
పటిష్ట బందోబస్తు..
ఎన్నికల కౌంటింగ్ కోసం సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన ఓ కంపెనీ పోలీసులతోపాటు స్థానిక పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎస్పీ, ఓఎస్డీ, డీఎస్పీతో పాటు దాదాపు 400 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.